రాష్ట్రానికి మరో 7.44 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ను తరలించారు. అక్కడినుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు.
Vaccine: రాష్ట్రానికి చేరుకున్న 7.44 లక్షల కొవిడ్ టీకా డోసులు - రాష్ట్రానికి కొవిషీల్డ్ డోసులు
రాష్ట్రానికి మరో 7.44 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకాలను నిల్వ కేంద్రానికి తరలించారు.
COVID VACCINE reached gannavaram airport