కొవిడ్-19కు వచ్చే ఏడాది ఆరంభంలోగా టీకా సిద్ధమయ్యే అవకాశం లేదని తెలంగాణలోని స్థానిక ‘సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు. ఈ మహమ్మారికి ప్రపంచంలోనే తొలి టీకాను వచ్చే నెల 15 కల్లా ఆవిష్కరించాలనుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంబంధిత ఆసుపత్రులకు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లినికల్ పరీక్షల నిర్వహణ విషయంలో సంబంధిత ఆసుపత్రులపై ఒత్తిడి తీసుకురావడానికే ఐసీఎంఆర్ దాన్ని రాసి ఉంటుందని తెలిపారు.
కరోనా టీకా ఈ ఏడాది సాధ్యం కాదు: సీసీఎంబీ డైరెక్టర్
కరోనాకు ఈ ఏడాది టీకా సాధ్యం కాదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఆగస్టు కల్లా టీకా తీసుకురావాలని ఐసీఎంఆర్... సంబంధిత ఆసుపత్రులకు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లినికల్ పరీక్షల నిర్వహణ విషయంలో సంబంధిత ఆసుపత్రులపై ఒత్తిడి తీసుకురావడానికే ఐసీఎంఆర్ దాన్ని రాసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కరోనా టీకా ఈ ఏడాది సాధ్యం కాదు: సీసీఎంబీ డైరెక్టర్
అంతా అనుకున్నట్లే జరిగితే టీకా సిద్ధం కావడానికి 6-8 నెలల సమయం పడుతుందన్నారు. ఒక వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చి, నయమైందా లేదా అని పరీక్షించే ఔషధం లాంటిది కాదు ఇది అని పేర్కొన్నారు. తాము నిత్యం 400-500 కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, దీని సంఖ్యను మరింతగా పెంచడానికి వీలుగా సురక్షితమైన ఒక కొత్త విధానాన్ని ఐసీఎంఆర్‌కు ప్రతిపాదించామన్నారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే పరీక్ష ఫలితాన్ని పొందొచ్చని చెప్పారు.