ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీకి అవసరమైనన్ని కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు సరఫరా చేస్తాం: కేంద్రం - ఏపీకి కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్

రాష్ట్రాలకి అవసరమైనన్ని కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్‌ రెండో తేదీ నాటికి .. 1,57,210 డోస్‌ల వ్యాక్సిన్‌ రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని పేర్కొంది.

covid vaccine
covid vaccine

By

Published : Mar 30, 2021, 9:34 AM IST

ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైనన్ని కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీకి మరో 1,57,210 డోస్‌ల వ్యాక్సిన్‌ కేటాయించామని, ఏప్రిల్‌ రెండో తేదీ నాటికి అవి రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తగిన పరిమాణంలో వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఈ నెల 26న లేఖ రాశారు. దానికి ఆ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ బదులిచ్చారు. వ్యాక్సిన్‌ ప్రక్రియకు అవరోధం కలిగే పరిస్థితి తలెత్తనీయమని స్పష్టంచేశారు.

ABOUT THE AUTHOR

...view details