ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

vaccination : నేటి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకా పంపిణీ - రాష్ట్రంలో వ్యాక్సినేషన్

రాష్ట్రంలో నేటి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకా పంపిణీ చేయనున్నారు. ముందుజాగ్రత్తగా ఈ వ్యాక్సిన్‌ను పిల్లలకు ఆసుపత్రుల్లో మాత్రమే వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వయసు కలిగిన పిల్లలు రాష్ట్రంలో 14.50 లక్షల మంది వరకు ఉన్నారు.

vaccination
vaccination

By

Published : Mar 16, 2022, 5:34 AM IST

రాష్ట్రంలో 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకా పంపిణీ బుధవారం నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ వయసు కలిగిన పిల్లలు రాష్ట్రంలో 14.50 లక్షల మంది వరకు ఉన్నారు. వీరందరికీ సరిపడేలా కోర్బెవాక్స్‌ టీకా విజయవాడకు చేరుకోగా జిల్లాలకు పంపించారు. ముందుజాగ్రత్తగా ఈ వ్యాక్సిన్‌ను పిల్లలకు ఆసుపత్రుల్లో మాత్రమే వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్‌కు గడువు విధించలేదు. వీరికి రెండో డోసు పంపిణీపై స్పష్టమైన మార్గదర్శకాలు రాకున్నా తొలి డోసు వేసిన 28 రోజులకు రెండోది వేసే అవకాశముంది. 0.5 ఎంఎల్‌ మోతాదు చొప్పున ఒక వయల్‌ ద్వారా 20 మంది పిల్లలకు టీకా ఇవ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details