కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో విడత ప్రక్రియ కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా మున్సిపల్, రెవెన్యూ, పోలీసు సిబ్బందికి టీకాలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజులోనే 25909 మందికి... కొవిడ్ టీకాలిచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మెుత్తం 1062 సెషన్ సైట్లలలో కొవిడ్ వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళంలో 4046 మందికి టీకాలివ్వగా.. అత్యల్పంగా కడపలో 915 మందికి ఇచ్చినట్లు వివరించారు.
అత్యధికం శ్రీకాకుళం... అత్యల్పం కడప! - రెండో విడత వ్యాక్సినేషన్ న్యూస్
రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని కరోనా వ్యాక్సిన్ తీసుకోగా.. అత్యల్పంగా కడపలో టీకా వేయించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా వ్యాక్సినేషన్