రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మొత్తం 12 వేల 807 మందికి కొవిషీల్డ్ టీకాను అందించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను 720 సెషన్ సైట్లలో వేసినట్టు చెప్పారు. మరో 11 సెషన్ సైట్లలో భారత్ బయోటెక్‌కి చెందిన 355 కొవాక్సిన్ టీకాను అందించినట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 45 వేల 425 మందికి వ్యాక్సిన్‌ను వేసినట్లుగా వివరించారు.
జనవరి 23 నాటికి రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నంలో 2,167, తూర్పుగోదావరిలో 1,601 మందికి కొవిషీల్డ్ టీకాను వేశారు. గుంటూరులో 16, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ముగ్గురికి వ్యాక్సిన్ అనంతరం కొంత ఇబ్బంది ఏర్పడినట్టు ప్రభుత్వం తెలియజేసింది.