ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వ్యాక్సినేషన్​కు చకచకా ఏర్పాట్లు.. కాసేపట్లో రాష్ట్రానికి డోసులు

ఈ నెల 16న నిర్వహించే కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు వైద్య అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. కాసేపట్లో ఈ డోసులు గన్నవరం విమానాశ్రయానికి రానున్నాయి.

covid vaccination Arrangements are completed  in AP
వ్యాక్సినేషన్​కు చకచకా ఏర్పాట్లు

By

Published : Jan 12, 2021, 11:58 AM IST

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 16న నిర్వహించే వ్యాక్సినేషన్‌కు వైద్య అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు.. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నాయి. గన్నవరంలోని రాష్ట్ర శీతలీకరణ కేంద్రానికి వ్యాక్సిన్‌ డోసులను తరలించనున్నారు. 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగేలా వ్యాక్సిన్ డెలివరీ వాహనాలు ఏర్పాటు చేశారు.

గన్నవరం రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో రెండు పెద్ద కూలర్స్ ఉంచారు. ఒకటి 40 క్యూబిక్ మీటర్లు, మరొకటి 20 క్యూబిక్ మీటర్ల కెపాసిటీతో ఉన్నాయి. వ్యాక్సిన్ భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 8 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. బయటి వ్యక్తులకు అనుమతి నిరాకరిస్తున్నారు. తొలిదశలో 3 లక్షల 87 వేల మంది వైద్య సిబ్బందికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details