ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: చనిపోయిన వ్యక్తికి కరోనా పరీక్షలు - telengana news

ఇన్నాళ్లు అనారోగ్యంతో చికిత్సపొందిన ఓ వ్యక్తి శనివారం రోజు మృతి చెందాడు. అతనిలో కరోనా లక్షణాలు కనిపించినందున అతడికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు వచ్చే వరకు అతడి మృతదేహాన్ని భద్రపరచనున్నారు.

telengana news
చనిపోయిన వ్యక్తికి కరోనా పరీక్షలు

By

Published : May 25, 2020, 3:01 PM IST

తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురానికి చెందిన నరసయ్య అనారోగ్యంతో ఈనెల 19న ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అయితే మృతదేహాహనికి కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. నిన్నటి వరకూ జనరల్ వార్డులో చికిత్స పొందిన నరసయ్యలో కరోనా లక్షణాలు కనిపించడం వల్ల అదే ఆసుపత్రిలోని కరోనా వార్డుకు తరలించారు.

ఈ క్రమంలోనే ఈ రోజు నరసయ్య మృతి చెందాడు. గొర్రెకుంట ఘటనలో మృతి చెందిన మృతదేహాలను ఎంజీఎం మార్చురీలో భద్రపరచడం వల్ల నరసయ్య మృతదేహాన్ని మార్చురీకి ఆనుకొని ఉన్న మరో గదిలో భద్రపరిచారు. నరసయ్యకు నిర్వహించిన కరోనా పరీక్షల రిపోర్టులు రాగానే విషయాన్ని వెల్లడిస్తామని ఆస్పత్రి కార్య నిర్వాహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు.

ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'

ABOUT THE AUTHOR

...view details