Foreign to AP: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్ర చిరునామాతో వస్తున్న ప్రయాణికులకు ఎక్కడికక్కడ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి సోమవారం వరకు రాష్ట్రానికి చెందిన సుమారు 8 వేల మంది విదేశాల నుంచి దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, రాష్ట్రంలోని విమానాశ్రయాలకు చేరుకున్నారు. విమానాశ్రయాల్లో వీరికి పరీక్షలు చేసి, ఫలితం తెలిసిన అనంతరమే ఇళ్లకు పంపిస్తున్నారు.
covid tests at airport: రాష్ట్రంలో వారు నివాసం ఉండే ప్రాంతాల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 8వేల మందికి జరిగిన పరీక్షల్లో 3 వేల మందికి నెగిటివ్ వచ్చింది. మిగిలిన వారి ఫలితాల వివరాలు అందాల్సి ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు సెల్‌ఫోన్లు పనిచేయకుండా స్విచ్చాఫ్ చేశారు. దీంతో వారి వివరాలు తెలుసుకోవడం అధికారులకు సమస్యగా తయారైంది.