రాష్ట్రంలో కొవిడ్ టీకా పంపిణీ కోసం 19 విభాగలకు చెందిన ఉన్నతాధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు అయ్యింది. రెండు మార్లు నిర్వహించిన డ్రై రన్లో తలెత్తిన ఇబ్బందులు, కొవిన్ యాప్, వెబ్ సైట్ సన్నద్ధత తదితర అంశాలను కొవిడ్ రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షించనుంది.
తొలి విడతలో ఏపీలో కోటి మందికి టీకా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వర్కర్ల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకా ఇచ్చే అంశంపై కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చించనుంది.