ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​ జూ పార్కులో 8 సింహాలకు కొవిడ్ - hyderabad zoo park latest news

హైదరాబాద్ జూ పార్కులోని 8 సింహాలకు కొవిడ్ నిర్ధరణ అయింది. జూపార్క్‌లోని 8 సింహాల్లో కొవిడ్‌ లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. సింహాల నుంచి ఇవాళ ఉదయం నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపారు. సింహాలు కొవిడ్‌ బారిన పడినట్లు సీసీఎంబీ నివేదికలో వెల్లడైంది.

హైదరాబాద్​ జూ పార్కులో 8 సింహాలకు కొవిడ్
హైదరాబాద్​ జూ పార్కులో 8 సింహాలకు కొవిడ్

By

Published : May 4, 2021, 5:33 PM IST

Updated : May 4, 2021, 6:17 PM IST

హైదరాబాద్​లోని నెహ్రూ జూ లాజికల్ పార్కులో ఎనిమిది ఆసియా సింహాలు కొవిడ్ బారినపడ్డాయి. సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయోలజీ (సీసీఎంబీ) సింహాలకు పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో మృగరాజులకు వైరస్ సోకినట్లు నిర్ధరణ అయినట్లు ప్రకటించింది. సింహాలన్ని ఐసోలేషన్​లో ఉన్నాయని, సింహాలు చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నట్లు సీసీఎంబీ వెల్లడించింది. జూలో ఉన్న ఇతర జంతువులు విషయంలో అవసరమైన చర్యలు అధికారులు తీసుకున్నారు.

వైరస్ జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతున్నదన్న దానికి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఆధారాలు లేవని సీసీఎంబీ వెల్లడించింది. సింహాలకు సోకిన కరోనాకు ప్రస్తుతం బయట ఆందోళన కలిగిస్తున్న వేరియంట్లకు సంబంధం లేదని పీఐబీ అధికారికంగా వెల్లడించింది. దేశంలోనే తొలిసారి జంతువులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ కావడం కలకలరం రేపుతోంది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ఈ నెల 2 నుంచి జూ పార్కులను అధికారులు మూసివేశారు.

Last Updated : May 4, 2021, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details