ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ మెట్రో రైల్లో కొండెక్కిన కొవిడ్‌ జాగ్రత్తలు - hyderabad latest news

హైదరాబాద్ మెట్రో రైల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్టేషన్లలో ఏర్పాటు చేసిన డబ్బాల్లో శానిటైజర్‌ ఉండటం లేదు. థర్మల్‌ స్కానర్లు పనిచేయడం లేదు. కొన్ని నెలలు జాగ్రత్తలు తీసుకోవాలని ఒకపక్క ప్రభుత్వం, వైద్యులు చెబుతుంటే.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్న మెట్రోలో మాత్రం క్రమంగా ఒక్కోటి నీరుగారుతోంది.

Breaking News

By

Published : Feb 3, 2021, 8:54 AM IST

లాక్‌డౌన్‌ అనంతరం సెప్టెంబరు 7న హైదరాబాద్​లో మెట్రో రైళ్లు పునఃప్రారంభమయ్యాయి. క్రమంగా రోజువారీ ప్రయాణికుల సంఖ్య 2 లక్షలకు చేరింది. మొదట్లో కొవిడ్‌ రక్షణ చర్యలు పకడ్బందీగా అమలు చేశారు. ప్రయాణికులు పెరుగుతున్న కొద్దీ క్రమంగా జాగ్రత్తలు నీరుగారుతున్నాయి. చాలా స్టేషన్లలో థర్మల్‌ స్కానర్లు అలంకార ప్రాయంగా ఉన్నాయి. శానిటైజర్‌ వచ్చే పరికరం సరిగా పనిచేయడం లేదు. శానిటైజర్‌ అయిపోతున్నా నింపడంలేదు. స్టేషన్‌ సహాయ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై కొందరు ఏఎస్‌వోలు దురుసుగా ప్రవరిస్తున్నారనే ఫిర్యాదులు ఎల్‌అండ్‌టీ మెట్రోకి అందాయి.

మాస్క్‌లు తీయొద్దని..

రైల్లో మాస్కులు ధరించని వారిపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక్కో సీటు వదిలి కూర్చోవాలన్నా.. ఎవరూ పాటించడం లేదని వాపోతున్నారు. కొవిడ్‌ జాగ్రత్తల దృష్ట్యా ప్రతి స్టేషన్‌లో ఒకవైపే గేట్లు తెరుస్తున్నారు. నాలుగు నెలలవుతున్నా రెండోవైపు తెరవడం లేదు. దీనిపై చాలా ఫిర్యాదులొస్తున్నాయి. చెత్త డబ్బాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదు. ● చాలాచోట్ల నీటి అవసరం లేని మరుగుదొడ్లు నిర్వహణ సరిగా లేక కంపుకొడుతున్నాయి.

ఇవీచూడండి:కర్రలు, రాడ్లతో తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు

ABOUT THE AUTHOR

...view details