ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ ఎఫెక్ట్: ఈసారీ ఆన్​లైన్​ వేదికగానే 'మహానాడు'

తెదేపా ప్రతీఏటా నిర్వహించే మహానాడుపై కొవిడ్ రెండోసారి ప్రభావం చూపనుంది. ఈసారీ ఆన్​లైన్​లోనే మహానాడు నిర్వహించాలని యోచిస్తున్నట్టు నేతలు చెబుతున్నారు. అయితే.. ఒకరోజా.. రెండు రోజులు నిర్వహించాలా..? అనేదానిపై త్వరలో స్పష్టత రానుంది. 28వ తేదీన ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో నాయకులు పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగరవేయటంతో పాటు అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించింది.

మహానాడు
మహానాడు

By

Published : May 22, 2021, 10:39 PM IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతిఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును... కొవిడ్ తీవ్రత దృష్ట్యా ఈసారి కూడా ఆన్​లైన్​లోనే నిర్వహించనున్నారు. కిందటి ఏడాది మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఆన్​లైన్​ వేదికగా మహానాడు నిర్వహించారు. ఈసారి కొవిడ్ మరింత ఉద్ధృతంగా ఉన్నందునా.. ఎన్టీఆర్ పుట్టినరోజు 28వ తేదీ ఒక రోజుకే పరిమితం చేయాలా లేక రెండు రోజులు నిర్వహించాలా..? అనే చర్చ కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతోంది.

ఏదేమైనప్పటికీ ఆన్​లైన్ వేదికను పార్టీ సిద్ధం చేసుకుంటోంది. సోమవారం అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే వ్యూహ కమిటీ సమావేశంలో మహానాడు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 28వ తేదీన ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో నాయకులు పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగరవేయటంతో పాటు అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించింది.

ఇదీ చదవండీ.. ప్రశ్నిస్తే.. దాడులకు దిగుతున్నారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details