ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఔషధాలు ఇవ్వాలి' - కరోనా ఔషదాలు

దేశంలో కరోనా కేసులు పెరిగినా ఔషధాల కొరత ఉండబోదని ఫార్మాస్యూటికల్ ఎగుమతుల కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ తెలిపారు. హైడ్రాక్సి క్లోరోక్విన్, పారాసిటమాల్‌కు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ఫార్మా కంపెనీలు తయారీని వేగవంతం చేశాయని వివరించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచదేశాలకు ఔషధాలు ఇవ్వాలంటున్న రవి ఉదయ్‌ భాస్కర్‌తో మా ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖి..!

'క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఔషధాలు ఇవ్వాలి'
'క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఔషధాలు ఇవ్వాలి'

By

Published : Apr 13, 2020, 9:27 AM IST

Updated : Apr 13, 2020, 10:06 AM IST

దేశంలో ఔషధాల కొరత ఉండబోదన్న ఫార్మాస్యూటికల్ ఎగుమతుల కౌన్సిల్ డీజీ

ప్ర. హైడ్రాక్సి క్లోరోక్విన్ నిల్వలు భారత్​లో ఎంతవరకు ఉన్నాయి?

జ. 80 శాతం హెచ్​సీక్యూ​ను భారత్ విడుదల చేస్తోంది. కొవిడ్-19కి ఈ డ్రగ్ వాడవచ్చు అని తెలిశాక దీనికి గిరాకీ బాగా పెరిగింది. ప్రపంచ దేశాలకూ మనం పంపిణీ చేస్తున్నాం. 30 మెట్రిక్ టన్నుల డ్రగ్స్ ఉత్పత్తి చేసే స్థితిలో ఉన్నాం.

ప్ర. పారసిటమాల్​ డ్రగ్స్​కు సంబంధించిన ముడి పదార్థాలు చైనా నుంచి దిగుమతి చేసుకోవచ్చా?

జ. ఔషధాల తయారీకి సరిపడా ముడిపదార్థాలు భారత్​లో ఉన్నాయి. చైనాలోని వుహాన్​లో పరిస్థితులు ఇప్పటికే మెరుగుపడ్డాయి. వుహాన్ నుంచి ముడిపదార్థాలు దిగుమతి చేసుకోవచ్చు.

ప్ర. భారత్​లో ఫార్మా సెక్టార్ ఎంత వరకు ఈ డ్రగ్స్​ను ఉత్పత్తి చేస్తోంది?

జ. ఒకవేళ భారత్​లో రెండు కోట్ల మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినా... వాళ్లకి వాడగలిగేంత స్టాక్​ను ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ప్ర. ప్రపంచ దేశాలు ఈ సాయాన్ని గుర్తు పెట్టుకుంటాయా?

జ. 10 కోట్ల మాత్రలు ఉత్పత్తి చేసే దశలో మనం ఉన్నాం. అలాంటప్పుడు మనకన్నా... క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రపంచదేశాలకు మనం ఔషధాలు ఇవ్వాలి. 20 ఏళ్ల క్రితం ఎయిడ్స్ నియంత్రణలోనూ భారత్ కీలకపాత్ర పోషించింది. ఈ సాయాన్ని ప్రపంచదేశాలు తప్పకుండా గుర్తు పెట్టుకుంటాయి.

ఇదీ చూడండి

చెన్నైలో 200 మంది సిక్కోలు కూలీల అవస్థలు

Last Updated : Apr 13, 2020, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details