కొవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా వేర్వేరు అంశాలను పర్యవేక్షించేందుకు... రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మరో అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొవిడ్ కమాండ్ కంట్రోల్‌కు వచ్చే సమాచార విశ్లేషణ కోసం (డేటా అనాలసిస్) ప్రత్యేకాధికారిగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ జెవీఎన్ సుబ్రహ్మణ్యాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సమాచార విశ్లేషణతో పాటు ఆస్పత్రులకు కావాల్సిన అత్యవసర సామగ్రి సేకరణ, కొనుగోళ్లు, ఆక్సిజన్ సరఫరా తదితర అంశాలను సమన్వయం చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రస్థాయి కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఇప్పటికే 22 మంది అధికారులను వివిధ అంశాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం నియమించింది.