ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా బాధితుల కోసం రూ.57 కోట్ల సాయం: కొవిడ్ కమాండ్ కంట్రోల్

కరోనా బాధితుల కోసం రూ.57 కోట్ల సాయం (Rs.57 crores has been provided for corona victims) అందిందని కొవిడ్ కమాండ్ కంట్రోల్ వెల్లడించింది. మరో రూ .25.2 కోట్ల సాయం వివిధ దశల్లో ఉందని తెలిపింది.

కరోనా బాధితుల కోసం రూ.57 కోట్ల సాయం అందింది
కరోనా బాధితుల కోసం రూ.57 కోట్ల సాయం అందింది

By

Published : Sep 21, 2021, 5:45 PM IST

Updated : Sep 21, 2021, 7:47 PM IST

రాష్ట్రంలో కొవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి ఇప్పటివరకూ 57 కోట్ల రూపాయల మేర సాయం అందిందని కొవిడ్ కమాండ్ కంట్రోల్ నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. మరో 25.2 కోట్ల మేర సాయం వివిధ దశల్లో వుందని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తులు ఆపన్న హస్తాన్ని అందిస్తుండటం అభినందనీయమని ఆయన వ్యాఖ్యానించారు. బయోఫోర్, లుపిస్, ఇండియా బుల్స్, నాట్కో ట్రస్ట్ వంటి సంస్థల నుంచి దాదాపు రూ.1.6 కోట్ల విలువైన ఔషధాలందాయని ఆయన వెల్లడించారు. అలాగే నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థతో కలిసి ప్రతి జిల్లా ఏరియా ఆస్పత్రిలో 10 పడకల ఐసీయూలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆరు జిల్లాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రుల్లో ఎసిటి ఫౌండేషన్ సంస్థ 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మిస్తోందని ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. మాస్టర్ కార్డ్, మాడ్యులస్ హౌసింగ్ సంస్థలు మొబైల్ ఆస్పత్రి యూనిట్లను అందజేశాయన్నారు.

అలాగే ఎన్టీపీసీ నుంచి 1.5 కోట్ల రూపాయల విలువైన పడకలు, ఇతర వైద్య పరికరాలు అందాయని తెలిపారు. అసిస్ట్ ఇంటర్నేషనల్ సంస్థ చిన్నారుల వెంటిలేటర్ల కోసం 10 లక్షల డాలర్లను అందజేసిందని స్పష్టం చేశారు. అమెరికన్-ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ సంస్థ 50 లక్షల ఎన్ 95 మాస్కులను, లక్ష పీపీఈ కిట్లను అందించిందని వెల్లడించారు. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, అంబులెన్స్ లను అందజేసిందని తెలిపారు. మాడ్యులస్ హౌసింగ్ సంస్థ తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలలో 100 పడకల సామర్థ్యం కలిగిన ఆస్పత్రులను నిర్మిస్తోందన్నారు. అలాగే వివిధ సంస్థల నుంచి ఇప్పటి వరకూ 3,100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 519 ఆక్సిజన్ సిలిండర్లు ప్రభుత్వానికి అందినట్టు శ్రీకాంత్ వెల్లడించారు. ఎఐఎఫ్ సంస్థ 500 ఎల్పిఎం ఆక్సిజన్ ప్లాంట్లను ప్రకాశం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలకు అందజేసిందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 1,179 కరోనా కేసులు.. 11 మరణాలు

Last Updated : Sep 21, 2021, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details