ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జడలువిప్పిన కరోనా...ఒక్కరోజులో 1608 కేసులు - కొవిడ్-19 వార్తలు

corona cases
రాష్ట్రంలో కొత్తగా 1608 కరోనా కేసులు

By

Published : Jul 10, 2020, 1:41 PM IST

Updated : Jul 11, 2020, 1:34 AM IST

13:40 July 10

కరోనాతో ఇప్పటివరకు 292 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1608 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత ఉద్ధృతమైంది.  ఒక్కరోజులో కొత్తగా  రికార్డుస్థాయిలో  1608 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసులు 25 వేలు దాటేశాయి. వైరస్‌ మహమ్మారి బారినపడి మరో 15 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 292కు చేరింది. నానాటికీ కేసులు సంఖ్య పెరుగుతున్నందున చాలాచోట్ల దుకాణాలు తెరిచే వేళలను కుదించారు. మాస్క్‌లు లేకుండా బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

తూర్పు గోదావరి జిల్లాలో 

తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కరోనా కేసుల తీవ్రత  పెరుగుతోంది.  ఇప్పటి వరకూ 458 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా... 54 కంటైన్‌మెంట్ జోన్లు కొనసాగుతున్నాయి. 10 చోట్ల కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. తునిలో ఇప్పటివరకూ 10 కేసులు నమోదు కాగా.... నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లో మరో పది కేసులు నమోదయ్యాయి. పురపాలక కార్యాలయంలోని  రెవెన్యూ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. కొత్తపేటలో మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతులివ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమపై పంజా

పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 144 పాజిటివ్ కేసులు నమోదుకాగా... మొత్తం కేసుల సంఖ్య1527కు చేరుకొంది. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 317గా ఉంది.  జంగారెడ్డిగూడెంలో రెండో పాజిటివ్ కేసు వచ్చింది. మంగళగిరి పీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్‌లకు కరోనా సోకగా... ఏలూరు కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఉంగుటూరు మండలంలో  వైద్యురాలికి కరోనా సోకింది.  ల్యాబ్‌లో పనిచేసే చేబ్రోలుకు చెందిన ఒక మహిళకు, బెంగళూరు నుంచి అదే గ్రామానికి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  

తితిదేలో కరోనా కలవరం

తితిదేలో  92 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్  నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు.  జిల్లాలో ఇప్పటివరకూ 2800 వరకు  కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్​లో  ఆయన పాల్గొని  జిల్లాలో కరోనా పరిస్థితిని వివరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో  2 రోజుల్లో 70కేసులు వెలుగుచూడగా.. మొత్తం 122మందికి కరోనా సోకింది. ఉదయం11 గంటల వరకూ మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో 200లకు పైగా కేసులు నమోదుకాగా...అధికారులు కంటైన్మెంట్ జోన్లలో పర్యటించారు.  

కలెక్టరేట్​లో కరోనా

శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో  మధ్యాహ్నం వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. రణస్థలం మండలం కేంద్రంలో 5 రోజులుగా సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో  ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్న అనుమానంతో  ...అందరికీ కరోనా పరీక్షలు  చేశారు. పాతపట్నం లో  3 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో ఈ నెల 31 వరకు  రోజూ ఉదయం 6  నుంచి 11 గంటల వరకే మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంటుందన్నారు.  నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో పనిచేసే డ్రైవర్ , అతని భార్య, తనయుడికి కరోనా సోకింది. చిల్లకూరు మండలం కన్పూరులో  కృష్ణపట్నం పోర్టు, సమీపంలోని పరిశ్రమల వారికోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.    

ఇదీ చదవండి : ఆ ప్రచారం నమ్మొద్దు... వయో పరిమితి తగ్గింపు లేదు : ఏపీ ఎన్జీవో సంఘం


 

Last Updated : Jul 11, 2020, 1:34 AM IST

ABOUT THE AUTHOR

...view details