CORONA CASES IN AP:ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 71 కొత్త కొవిడ్ కేసులు నమోదవగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో 595 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 14,727 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,325 యాక్టివ్ కేసులున్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Corona cases in India:దేశంలో కరోనా కేసుల సంఖ్య పదివేల దిగువకు చేరింది. కొత్తగా 8,013 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ నుంచి మరో 16,765 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 119మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.11శాతంగా ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 4,90,321 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,77,50,86,335కు చేరింది.
- మొత్తం మరణాలు: 5,13,843
- యాక్టివ్ కేసులు: 1,02,601
- కోలుకున్నవారు: 4,23,07,686