ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో 531కి చేరిన కరోనా కేసులు - today updates

తెలంగాణలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. మొత్తం 531 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టంగా లాక్​డౌన్​ అమలు చేయనుంది.

తెలంగాణలో 531కి చేరిన కరోనా కేసులు
తెలంగాణలో 531కి చేరిన కరోనా కేసులు

By

Published : Apr 13, 2020, 7:38 AM IST

తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మరింత పెరిగింది. తాజాగా 28 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 531కి చేరింది. ఆదివారం కరోనాతో మరో ఇద్దరు మృతి చెందగా.. మృతుల సంఖ్య 16కు చేరుకుంది. చికిత్స పొందుతున్న వారిలో నిన్న మరో ఏడుగురు కోలుకుని డిశ్చార్జ్​ కాగా.. మొత్తం డిశ్చార్జ్​ అయిన వారి సంఖ్య 103కి చేరింది.

ABOUT THE AUTHOR

...view details