ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా వ్యాప్తి కట్టడికి 'కొవిడ్-19 ఏపీ ఫార్మా' యాప్ - రాష్ట్రంలో కొవిడ్ 19 ఏపీ ఫార్మా యాప్

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి 'కొవిడ్‌- 19 ఏపీ ఫార్మా' అనే యాప్​ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రవేశపెట్టింది. ఈ యాప్​ను మందులు దుకాణాదారులు డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించింది. వారి దగ్గరకు మందులు కొనడానికి వచ్చేవారి వివరాలు అందులో పొందుపరచాలని స్పష్టం చేసింది.

covid 19 ap pharmaa app for medical shops due to corona
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి 'కొవిడ్-19 ఏపీ ఫార్మా' యాప్

By

Published : Apr 26, 2020, 4:23 PM IST

కరోనా వ్యాప్తి కట్టడికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అందుబాటులో ఉన్న అన్ని వనరుల్ని వాడుకుంటోంది. తాజాగా 'కొవిడ్-19 ఏపీ ఫార్మా' అనే యాప్​ను ప్రవేశపెట్టింది

యాప్ పనిచేసే విధానం

* గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్​ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

* మొబైల్ నంబరుతో రిజిస్టర్ అవ్వాలి.

* తర్వాత ఎంటర్ చేసిన మొబైల్ నంబరుకి ఓటీపీ వస్తుంది. ఆ నంబరుతో యాప్​లోకి లాగిన్ అవ్వాలి.

* జ్వరం, దగ్గు, శ్వాసపరమైన ఇబ్బందులు వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్‌లో పొందుపర్చాలి.

ఈ సమాచారం మేరకు స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది. కరోనాపై పోరాటంలో మెడికల్ షాపుల యజమానులు ప్రభుత్వానికి సహకరించాలని వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

ఇవీ చదవండి.. సీఎంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details