ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుడ్ న్యూస్: నవంబరులో కోవాగ్జిన్‌ తుది దశ పరీక్షలు - నిమ్స్​లో త్వరలో కొవాగ్జీన్​ ఆఖరి దశ పరీక్షలు

కరోనాను అరికట్టేందుకు భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకాకు సంబంధించి ఆఖరి దశ క్లినికల్​ పరీక్షలు హైదరాబాద్​లోని నిమ్స్​లో వచ్చే నెల ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తొలి దశ పరీక్షలు పూర్తవగా మంగళవారం రెండో దశలో భాగంగా 12 మందికి టీకా ఇచ్చి బూస్టర్​ డోస్​ ప్రక్రియను ప్రారంభించినట్లు క్లినికల్​ ట్రయల్స్​ నోడల్​ అధికారి డా. ప్రభాకర్​రెడ్డి వివరించారు.

covaxin-final-phase-tests-to-start-from-november-in-nims
నవంబరులో కోవాగ్జిన్‌ తుది దశ పరీక్షలు

By

Published : Oct 7, 2020, 7:58 AM IST

కరోనాను అరికట్టేందుకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకాకు సంబంధించి మూడో దశ(చివరిది) క్లినికల్‌ పరీక్షలు వచ్చే నెలలో మొదలు కానున్నాయి. మొదటి లేదా రెండో వారంలో వీటిని ప్రారంభించనున్నట్లు హైదరాబాద్​లోని నిమ్స్‌ వైద్య వర్గాలు తెలిపాయి. క్లినికల్‌ పరీక్షల్లో భాగంగా ఇప్పటికే నిమ్స్‌లో తొలి దశ పరీక్షలు ముగిశాయి.

రెండో దశలో భాగంగా మంగళవారం 12 మందికి టీకా ఇచ్చి బూస్టర్‌ డోస్‌ ప్రక్రియ ప్రారంభించామని క్లినికల్‌ ట్రయల్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వచ్చే మూడు రోజుల వ్యవధిలో మరో 55 మందికి టీకా ఇస్తామన్నారు. 14 రోజుల తర్వాత వీరందరి రక్త నమూనాలు సేకరించి భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)కి పంపతామన్నారు.

మరోవైపు తొలిదశలో 45 మందికి నిమ్స్‌లో టీకా ఇవ్వగా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వైద్య బృందం తెలిపింది. మొదటి, రెండో దశల్లో మొత్తం 100 మంది వాలంటీర్లు భాగస్వాములయ్యారని డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. దాదాపు 6 నెలలపాటు వాలంటీర్ల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. మూడో దశ పరీక్షల్లో 200 మందికి టీకా ఇచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.

ఇదీ చదవండిః'స్వదేశీ వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకం'

ABOUT THE AUTHOR

...view details