MIM MLA Akbaruddin: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ నమోదైన కేసుల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువరించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు చూపించలేదన్న కోర్టు.. భవిష్యత్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని అక్బరుద్దీన్‌ను ఆదేశించింది. దేశ సార్వభౌమత్వం దృష్ట్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.
MIM MLA Akbaruddin: అక్బరుద్దీన్ నిర్దోషి.. తేల్చిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం - ts news
MIM MLA Akbaruddin: విద్వేషపూరిత ప్రసంగం చేశారని నమోదైన కేసుల్లో.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ని నాంపల్లి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే.. 2012 డిసెంబర్ 8న నిజామాబాద్‌లో, 2012 డిసెంబర్ 22న నిర్మల్‌లో విద్వేషపూరిత ప్రసంగం చేశారని అక్బరుద్దీన్‌పై కేసు నమోదైంది. నిర్మల్, నిజామాబాద్ పోలీసులు.. 2013 జనవరి 2న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2013 జనవరి 8న అక్బరుద్దీన్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు తరలించారు. అక్బర్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అక్బరుద్దీన్ ఓవైసీ 40 రోజులపాటు జైల్లోనే ఉన్నారు. 2013 ఫిబ్రవరి 16న జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. నిజామాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్‌స్టేషన్, దిల్లీలో నమోదైన కేసులను 2013 జనవరి 1న అప్పటి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. నిర్మల్ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. నిజామాబాద్ కేసులో 41 మంది, నిర్మల్ కేసులో 33 మంది సాక్షులను విచారించారు. 2016లో... సీఐడీ, నిర్మల్ పోలీసులు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఏ-1గా అక్బరుద్దీన్, ఏ-2 గా యాయా ఖాన్‌ను చేర్చారు. అక్బరుద్దీన్ వీడియో ఫుటేజ్ ను సీఎఫ్ఎస్ఎల్కు పంపించి పరీక్షించారు. ప్రసంగంలో గొంతు అక్బరుద్దీన్ దేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తేల్చింది.
ఇవీ చదవండి: