Husband killed wife: పెళ్లయిన కొద్ది రోజులకే అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్య(husband killed wife)నే కడతేర్చాడు ఓ భర్త. ఆమెను చంపేశాక పోలీసులకు ఎలాగూ దొరుకుతాను.. శిక్ష తప్పదని భావించాడో ఏమో.. తానూ పురుగులమందు తాగి ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అనుమానంతో భార్యను చంపి.. భయంతో తర్వాత - భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
Couple Died in Hanamakonda: ఆలూమగల అన్యోన్య దాంపత్యానికి నమ్మకం, ప్రేమ పునాది. వాటిలో ఏది కొరవడినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. చివరికి అది ఎలాంటి పరిణామాలకైనా దారి తీసే అవకాశం ఉంది. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను చంపి తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తల్లా హరీష్ అనే యువకుడికి.. తూర్పు గోదావరి జిల్లా ఏటపాక మండలం గౌరీదేవిపేట గ్రామానికి చెందిన పుష్పలీలతో జూన్ 17వ తేదీన వివాహం జరిగింది. అప్పటినుంచే భార్యపై అనుమానం కలగడంతో.. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అలా నిత్యం పుష్పలీలను వేధించిన భర్త.. పెళ్లయిన 20 రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రి నుంచి వచ్చాక మరింత అనుమానం పెంచుకొని.. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేనిది చూసి కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: