ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పల్లె తీర్పు: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఇవే..

counting start in ap panchayth first phase elections
counting start in ap panchayth first phase elections

By

Published : Feb 9, 2021, 4:04 PM IST

Updated : Feb 10, 2021, 12:46 PM IST

12:45 February 10

కొత్తపల్లెలో ముగిసిన ఓట్ల లెక్కింపు

కడప: కొత్తపల్లెలో ముగిసిన ఓట్ల లెక్కింపు

కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్‌గా శివచంద్రారెడ్డి విజయం

12:05 February 10

చీమకుర్తి మం. నిప్పట్లపాడులో టాస్‌ గెలిచి సర్పంచ్‌ పదవి కైవసం

ప్రకాశం: చీమకుర్తి మం. నిప్పట్లపాడులో టాస్‌ గెలిచి సర్పంచ్‌ పదవి కైవసం

ఓట్ల లెక్కింపులో ఇద్దరికి సమాన ఓట్లు రావడంతో టాస్‌ వేసిన అధికారులు

టాస్‌ గెలిచి నిప్పట్లపాడు సర్పంచ్ పదవి కైవసం చేసుకున్న కోటేశ్వరరావు

11:18 February 10

పోతులూరులో పంచాయతీ అభ్యర్థి ప్రకటనపై ఉద్రిక్తం

  • తూ.గో.: పోతులూరులో పంచాయతీ అభ్యర్థి ప్రకటనపై ఉద్రిక్తం
  • మూడుసార్లు లెక్కింపు చేపట్టిన అధికారులు, స్థానికుల ఆగ్రహం
  • తొలుత సర్పంచిగా 3 ఓట్ల మెజార్టీతో కుంచె నూకరాజు గెలుపు
  • ప్రత్యర్థి అభ్యర్థి రీకౌంటింగ్‌ కోరడంతో మళ్లీ ఓట్ల లెక్కింపు
  • రెండోసారి లెక్కింపులో 2 ఓట్ల తేడాతో రాంబాబు గెలిచినట్లు ప్రకటన
  • పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు 5 ఓట్లు తేడా రావడంతో అభ్యంతరం
  • మూడోసారి లెక్కింపులో 6 ఓట్ల తేడాతో రాంబాబు గెలిచినట్లు ప్రకటన
  • రాంబాబు గెలుపొందినట్లు ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు
  • డీఎస్పీ ఆధ్వర్యంలో పరిస్థితిని అదుపు చేస్తున్న పోలీసులు
  • పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల అధికారుల తరలింపు

10:59 February 10

తుమ్మలపల్లి పంచాయతీకి నాలుగో సారి ఓట్ల లెక్కింపు

  • కడప: తుమ్మలపల్లి పంచాయతీకి నాలుగో సారి ఓట్ల లెక్కింపు
  • తుమ్మలపల్లిలో ఇప్పటికే మూడుసార్లు లెక్కించిన అధికారులు
  • మొదటిసారి లెక్కింపులో కొప్పర్తి రామసుబ్బారెడ్డికి 3 ఓట్లు ఆధిక్యం
  • కడప: రెండోసారి 2 ఓట్లు, మూడోసారి లెక్కింపులో ఒక ఓటు ఆధిక్యం
     

09:45 February 10

కిర్లంపూడి తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఆందోళన

  • తూ.గో.: కిర్లంపూడి తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఆందోళన
  • ఒక్క ఓటు తేడాతో దావీదుపై విజయం సాధించిన రాయుడు స్వామి
  • తూ.గో.: రీకౌంటింగ్ కోరిన ప్రత్యర్థి అభ్యర్థి రాయుడు స్వామి

09:31 February 10

భావనపాడులో అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య గొడవ

  • శ్రీకాకుళం: భావనపాడులో అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య గొడవ
  • మోహన్‌రెడ్డి గెలవడంతో ప్రత్యర్థి అభ్యర్థి అనుచరులు వీరంగం
  • కొత్తపేట, మధ్యపేటలోని పలు ఇళ్లపై అభ్యర్థి గురువులు అనుచరులు దాడి

09:23 February 10

  • తూ.గో.: పిఠాపురం మం. కందరాడ రీకౌంటింగ్ పూర్తిచేసిన అధికారులు
  • 43 బ్యాలెట్ పత్రాలు లేనట్లు గుర్తించిన కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ
  • తూ.గో.: రాత్రి బ్యాలెట్ పత్రాలు అపహరించిన కొందరు వ్యక్తులు
  • బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లడంపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫలితంపై నిర్ణయం తీసుకోనున్న కలెక్టర్

09:07 February 10

ఎలమంచిలి మం. ఏటికొప్పాకలో భజంత్రీల లక్ష్మి విజయం

  • విశాఖ: ఎలమంచిలి మం. ఏటికొప్పాకలో భజంత్రీల లక్ష్మి విజయం
  • లక్ష్మి 175 ఓట్ల తేడాతో గెలిచినట్లు అర్ధరాత్రి 2 గం.కు ప్రకటించిన అధికారులు

08:28 February 10

పోతులూరులో మూడోసారి కౌంటింగ్‌ ప్రారంభం

తూ.గో.: పోతులూరులో మూడోసారి కౌంటింగ్‌ ప్రారంభం

తొలుత సర్పంచిగా 3 ఓట్ల మెజార్టీతో కుంచె నూకరాజు గెలుపు

ప్రత్యర్థి అభ్యర్థి రీకౌంటింగ్‌ కోరడంతో మళ్లీ లెక్కించిన అధికారులు

రెండోసారి లెక్కింపులో బొందు రాంబాబు 2 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటన

08:06 February 10

తుమ్మలపల్లి పంచాయతీకి రాత్రి మూడుసార్లు రీకౌంటింగ్

కడప: బి.కోడూరు మం. తుమ్మలపల్లి పంచాయతీకి రాత్రి మూడుసార్లు రీకౌంటింగ్

కాసేపట్లో మళ్లీ లెక్కింపు చేపట్టనున్న అధికారులు

08:04 February 10

తాళ్లరేవు సర్పంచ్‌గా రెడ్డి అరుణ విజయం

తూ.గో.: తాళ్లరేవు సర్పంచ్‌గా రెడ్డి అరుణ విజయం

తూ.గో.: పటవల సర్పంచ్‌గా పెనుబోతు చిన్నకామేశ్వరరావు విజయం

తూ.గో.: జార్జిపేట సర్పంచ్‌గా కోళ్ల సత్యదేవి గెలుపు

తూ.గో.: కోరంగి పంచాయతీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

07:42 February 10

గాడిమొగ సర్పంచ్‌గా మాతరాజు గెలుపు

తూ.గో.: గాడిమొగ సర్పంచ్‌గా మాతరాజు గెలుపు

తూ.గో.: ఉప్పంగల సర్పంచ్‌గా శంకరుడు విజయం

తూ.గో.: కోరంగి పంచాయతీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

07:37 February 10

  • ప.గో.: అర్ధరాత్రి వరకు కొనసాగిన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • కాళ్లకోడేరు, కేపీ పాలెం పంచాయతీల్లో వివాదాలతో ఆగిన ఓట్ల లెక్కింపు
  • మొత్తం 198లో 196 పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి

07:23 February 10

బ్యాలెట్ పత్రాల అపహరణ

  • తూ.గో.: కందరాడలో సర్పంచ్‌ అభ్యర్థి నాగభారతిపై సుశీల ఆధిక్యం
  • బయటనుంచి వచ్చి బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లిన కొందరు వ్యక్తులు

07:08 February 10

బ్రాహ్మణకోడూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

  • గుంటూరు: బ్రాహ్మణకోడూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్న ఇరువర్గాల మద్దతుదారులు
  • మొదటిసారి లెక్కింపులో పి.అశోక్‌కుమార్‌కు 18 ఓట్ల ఆధిక్యం
  • మరోసారి లెక్కించగా పి.అశోక్‌కుమార్‌కు 12 ఓట్ల ఆధిక్యం
  • మూడోసారి లెక్కించాలని పట్టుబడుతున్న ప్రత్యర్థి వర్గం
  • రెండు వర్గాలవారితో అధికారులు, పోలీసుల చర్చలు

07:00 February 10

వెదుళ్లపల్లి సర్పంచ్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ

  • గుంటూరు: వెదుళ్లపల్లి సర్పంచ్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ
  • తొలుత కుంచాల గోవిందమ్మకు ఒక్క ఓటు మెజారిటీ
  • ప్రత్యర్థి రీకౌంటింగ్ కోరగా మళ్లీ లెక్కించగా గోవిందమ్మకు 24 ఓట్ల మెజార్టీ
  • ప్రత్యర్థి డిమాండ్‌తో మూడోసారి ఓట్ల లెక్కింపు ప్రారంభించిన అధికారులు
  • రెండోసారి రీకౌంటింగ్‌పై గోవిందమ్మ మద్దతుదారుల ధర్నా
  • పోటీగా ప్రత్యర్థి మద్దతుదారులు ధర్నా
    పరిస్థితి సమీక్షిస్తున్న బాపట్ల డి.ఎస్.పి శ్రీనివాస రావు
     

07:00 February 10

  • కడప జిల్లాలో కొనసాగుతున్న కొత్తపల్లి మేజర్ పంచాయతీ ఓట్ల లెక్కింపు

06:38 February 10

కొత్తపల్లి పంచాయతీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

కడప: కొత్తపల్లి పంచాయతీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు 

కడప: నిన్న రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 

20 వార్డుల ఓట్ల లెక్కింపు అనంతరం సర్పంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం 

06:38 February 10

బ్రాహ్మణకోడూరులో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత

గుంటూరు: బ్రాహ్మణకోడూరులో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత

గుంటూరు: తొలుత సర్పంచిగా 6 ఓట్ల మెజార్జీతో కొర్రపాటి అశోక్‌ గెలుపు

రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసిన ప్రత్యర్థి సౌపాటి ప్రేమ్‌కుమార్‌ మద్దతుదారులు

రీకౌంటింగ్‌ కొనసాగుతుండగా భారీగా చేరుకున్న ఇరువర్గాల మద్దతుదారులు

గుంటూరు: రీకౌంటింగ్‌ పూర్తి అయినా ఫలితాన్ని వెల్లడించని అధికారులు

06:08 February 10

పోతుంలూరు పంచాయతీలో ఓట్ల లెక్కింపు వివాదాస్పదం

తూ.గో.: పోతుంలూరు పంచాయతీలో ఓట్ల లెక్కింపు వివాదాస్పదం
తూ.గో.: తొలుత సర్పంచిగా 3 ఓట్లు మెజార్టీతో కుంచె నూకరాజు గెలుపు

తూ.గో.: రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసిన ప్రత్యర్థి మద్దతుదారులు

రీకౌంటింగ్‌లో ఓట్లు మాయం చేశారని కుంచె నూకరాజు మద్దతుదారుల ఆరోపణ

తూ.గో.: తమకు అన్యాయం జరిగిందని నూకరాజు మద్దతుదారుల ఆందోళన
తూ.గో.: ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నెలకొన్న ఉద్రిక్తత 
మొత్తం పోలైన ఓట్లు.. అభ్యర్థులకు వచ్చిన ఓట్లతో సరి చూపాలని డిమాండ్

05:49 February 10

  • తూ.గో.: పోతుంలూరు పంచాయతీలో ఓట్ల లెక్కింపు వివాదాస్పదం
  • తెదేపా మద్దతు ఇచ్చిన కుంచె నూకరాజు 3 ఓట్లు మెజార్టీతో గెలుపు
  • తూ.గో.: రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసిన ప్రత్యర్థి మద్దతుదారులు
  • రీకౌంటింగ్‌లో ఓట్లు మాయం చేశారని కుంచె నూకరాజు మద్దతుదారుల ఆరోపణ
  • తమకు అన్యాయం జరిగిందని నూకరాజు మద్దతుదారుల ఆందోళన
  • తూ.గో.: ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నెలకొన్న ఉద్రిక్తత
  • మొత్తం పోలైన ఓట్లు.. అభ్యర్థులకు వచ్చిన ఓట్లతో సరి చూపాలని డిమాండ్

04:56 February 10

  • నెల్లూరు: లక్ష్మీపురం సర్పంచిగా దాసరి కొండమ్మ విజయం
  • నెల్లూరు: చినఅన్నలూరు సర్పంచిగా రాగి కుమారి విజయం
  • నెల్లూరు: కలిగిరి సర్పంచిగా రాగి దివ్య విజయం
  • నెల్లూరు: తుమ్మలపెంట మేజర్ పంచాయతీలో కోమరి ప్రసన్న గెలుపు

03:40 February 10

  • కృష్ణా: చందర్లపాడు మండలం ముప్పాళ్లలో ఉద్రిక్తత
  • ముప్పాళ్ల సర్పంచ్‌గా కుసుమరాజు వీరన్న విజయం
  • 20 ఓట్ల ఆధిక్యంతో కుసుమరాజు వీరన్న గెలుపు
  • కృష్ణా: రీకౌంటింగ్‌ చేయాలంటూ ప్రత్యర్థి డిమాండ్‌
  • ఇరువర్గాల ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు

01:07 February 10

  • తూ.గో.: పిఠాపురం మం. కందరాడలో ఉద్రిక్తత
  • సర్పంచ్‌ అభ్యర్థి నాగభారతిపై సుశీల ఆధిక్యం
  • బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లిన కొందరు వ్యక్తులు
  • బయట నుంచి వచ్చి బ్యాలెట్ పత్రాలు అపహరణ
  • తూ.గో.: ఆందోళనకు దిగిన సుశీల మద్దతుదారులు
  • తూ.గో.: సుశీల గెలుపును ప్రకటించాలని డిమాండ్‌

01:06 February 10

  • గుంటూరు జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి: కలెక్టర్‌
  • 270 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు: జిల్లా ఎన్నికల అథారిటీ వివేక్‌యాదవ్‌
  • 204 సర్పంచ్‌ స్థానాల ఓట్లలెక్కింపు పూర్తి, ఫలితాలు వెల్లడి: వివేక్‌యాదవ్‌
  • 270 గ్రామపంచాయతీల్లో మొత్తం 2,105 వార్డులకు ఎన్నికలు: వివేక్‌యాదవ్‌
  • 1,878 వార్టులకు ఓట్ల లెక్కింపు పూర్తి, ఫలితాలు వెల్లడి: వివేక్‌యాదవ్‌

00:31 February 10

  • కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • వెలువడుతున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలు
  • 12 జిల్లాల్లో ప్రశాంతంగా పూర్తయిన తొలిదశ పోలింగ్‌

00:27 February 10

  • తూ.గో.: ఉప్పలపాడు సర్పంచ్‌గా అడబాల ఆంజనేయులు గెలుపు
  • మేడిబోయిన శ్రీనుపై ఏడు ఓట్ల తేడాతో అడబాల ఆంజనేయులు గెలుపు
  • రీకౌంటింగ్ పెట్టాలని స్వతంత్ర అభ్యర్థి మేడిబోయిన శ్రీను డిమాండ్‌
  • తూ.గో.: రీకౌంటింగ్ నిర్వహించని అధికారులు
  • ఓడిన అభ్యర్థి మేడిబోయిన శ్రీను మద్దతుదారుల ధర్నా
  • తూ.గో.: కరప మండలం అరట్లకట్టలో నిలిచిన ఓట్ల లెక్కింపు
  • తూ.గో.: రెండున్నర గంటలపాటు నిలిచిన ఓట్ల లెక్కింపు
  • తూ.గో.: 4వ వార్డులో సూరిబాబుపై రవికుమార్ 2 ఓట్లు తేడాతో గెలుపు
  • వార్డుల లెక్కింపు పూర్తయ్యాక రీకౌంటింగ్ చేయాలని ఓడిన అభ్యర్థి డిమాండ్
  • తూ.గో.: నిరసనకు దిగిన గెలిచిన అభ్యర్థి మద్దతుదారులు
  • సర్పంచి ఓట్ల కౌంటింగ్ ఏజెంట్లను తీసుకుపోయిన ఓడిన అభ్యర్థి
  • తూ.గో.: రెండున్నర గంటల నుంచి నిలిచిన కౌంటింగ్
  • ప.గో.: కాళ్లకూరి సర్పంచి ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉద్రిక్తత
  • తొలుత బొర్రా విజయకుమారి 30 ఓట్ల తేడాతో గెలుపు
  • అనంతరం 5 ఓట్ల తేడాతో సాదు శ్రీదేవి గెలిచినట్లు ప్రకటన
  • న్యాయం చేయాలంటూ బొర్రా విజయకుమారి వర్గం ఆందోళన
  • విజయవాడ - భీమవరం రహదారిపై భారీ స్తంభించిన ట్రాఫిక్
  • రీపోలింగ్ చేయాలని డిమాండ్‌, పోలీసుల మోహరింపు

23:38 February 09

23:36 February 09

  • కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • వెలువడుతున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలు
  • 12 జిల్లాల్లో ప్రశాంతంగా పూర్తయిన తొలిదశ పోలింగ్‌
  • గుంటూరు: కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో ఉద్రిక్తత
  • పంచాయతీ ఎన్నికల విజేతను ప్రకటించాలని డిమాండ్
  • పోలింగ్ సిబ్బంది వాహనం వెళ్లకుండా అడ్డుకున్న గ్రామస్తులు
  • గుంటూరు: వెదుల్లపల్లి సర్పంచి ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ గుంటూరు: తొలుత కుంచాల గోవిందమ్మ ఒక్క ఓటు మెజార్టీ
  • గుంటూరు: రీకౌంటింగ్ డిమాండ్ చేసిన ప్రత్యర్థి వర్గం
  • రెండోసారి ఓట్ల లెక్కింపులో గోవిందమ్మకు 24 ఓట్ల మెజార్టీ
  • గుంటూరు: మరోసారి రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసిన ప్రత్యర్థి మూడోసారి ఓట్ల లెక్కింపు ప్రారంభించిన అధికారులు
  • రెండోసారి రీకౌంటింగ్‌పై గోవిందమ్మ మద్దతుదారుల ధర్నా
  • గుంటూరు: పోటీగా ధర్నాకు దిగిన ప్రత్యర్థి మద్దతుదారులు
  • పరిస్థితిని సమీక్షిస్తున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు
  • తూ.గో.: ఉప్పలపాడు సర్పంచిగా అడబాల ఆంజనేయులు గెలుపు
  • తూ.గో.: రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసిన ప్రత్యర్థి వర్గం
  • తూ.గో.: ఎం.కొత్తూరు సర్పంచిగా వంతు రామలక్ష్మి ఒక్క ఓటుతో గెలుపు

21:58 February 09

  • కృష్ణా: కందలంపాడు సర్పంచిగా 1 ఓటు ఆధిక్యంతో నాగరాజు గెలుపు
  • శ్రీకాకుళం: నిమ్మాడలో కింజరాపు సురేశ్‌ విజయం
  • మాజీమంత్రి అచ్చెన్నాయుడు అన్న కుమారుడు కింజరాపు సురేశ్‌

21:33 February 09

  • గుంటూరు: పిడపర్తిపాలెం సర్పంచిగా 1 ఓటు ఆధిక్యంతో గెలిచిన కరుణశ్రీ
  • గుంటూరు: తోట్లపాలెం సర్పంచిగా 6 ఓట్లతో వీరరాఘవయ్య గెలుపు
  • గుంటూరు: గార్లపాడు సర్పంచిగా 14 ఓట్లతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేశ్‌ గెలుపు
  • గుంటూరు: చావావారిపాలెం సర్పంచి అభ్యర్థి కొరబోయిన జ్యోతికి 0 ఓట్లు

21:00 February 09

ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపు

  • నెల్లూరు: పామూరుపల్లి సర్పంచిగా ఒక్క ఓటు ఆధిక్యంతో తెల్ల గొర్ల సుశీల విజయం

20:14 February 09

  • విశాఖ: తగరంపూడి సర్పంచిగా 2 ఓట్ల ఆధిక్యంతో అప్పారావు గెలుపు

19:48 February 09

  • ప్రకాశం: తక్కెళ్లపాడు సర్పంచిగా నూతలపాటి రామ్మోహన్‌రావు విజయం
  • ప్రకాశం: ఓబన్నపాలెం సర్పంచిగా పోలినేని వెంకటేశ్వర్లు గెలుపు
  • కృష్ణా: బొడ్డపాడు సర్పంచిగా శివశంకర్ గెలుపు
  • కృష్ణా: చినపులిపాక సర్పంచిగా ఆరేపల్లి శివరామకృష్ణ విజయం
  • తూ.గో.: ఎస్.పైడిపాల సర్పంచిగా జిగిరెడ్డి నారాయణమ్మ విజయం

19:36 February 09

  • ప్రకాశం: ఓబన్నపాలెం సర్పంచిగా పోలినేని వెంకటేశ్వర్లు గెలుపు


 

19:34 February 09

  • విశాఖ: బి.సింగవరం సర్పంచిగా సన్యాసినాయుడు విజయం
  • విశాఖ: గోటివాడ సర్పంచిగా గోకాడ అర్జున గెలుపు
  • విశాఖ: ఎం.కోటపాడు సర్పంచిగా సేనాపతి శేషఫణి విజయం
  • విశాఖ: వెంకటరాజుపాలెం సర్పంచిగా దాసరి వెంకటరమణ గెలుపు
  • విశాఖ: ఎ.కొత్తపల్లి సర్పంచిగా చింతల సత్య వెంకటరమణ విజయం
  • విశాఖ: బైలపూడి సర్పంచిగా జాజిమొగ్గల సత్యనారాయణ గెలుపు

19:27 February 09

  • ప.గో.: ఊటాడ సర్పంచిగా బుడితి జయరాజు విజయం
  • ప.గో.: పాలమూరు సర్పంచిగా నారాయణస్వామినాయుడు విజయం
  • ప.గో.: గంగడపాలెం సర్పంచిగా మల్లాడి ఉమా మహేశ్వరి విజయం
  • కృష్ణా: చలివేంద్రపాలెం సర్పంచిగా బొమ్మరెడ్డి శివనాగిరెడ్డి విజయం

19:25 February 09

ఒక్క ఓటుతో విజయం..

  • కృష్ణా: కంకిపాడు మం. కందలంపాడు సర్పంచిగా బైరెడ్డి నాగరాజు గెలుపు
  • ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించిన బైరెడ్డి నాగరాజు

19:17 February 09

  • విశాఖ: సీతానగరం సర్పంచిగా సుంకర చంటి గెలుపు

19:16 February 09

  • చిత్తూరు: ఒరూరుపేట సర్పంచిగా జయంతి గెలుపు
  • చిత్తూరు: కచ్చరవేడు సర్పంచిగా రాణమ్మ గెలుపు
  • చిత్తూరు: ఎం.ఎస్.వి.పురం సర్పంచిగా సుబ్రహ్మణ్యంరాజు విజయం
  • చిత్తూరు: జీఎన్‌ కండ్రిగ సర్పంచిగా జయచంద్రారెడ్డి విజయం
  • చిత్తూరు: నెట్టేరి సర్పంచిగా సరోజమ్మ గెలుపు
  • చిత్తూరు: పాలకూరు సర్పంచిగా పంకజాక్షి గెలుపు
  • చిత్తూరు: వడ్డేపల్లి సర్పంచిగా దొరస్వామినాయుడు విజయం
  • ప్రకాశం: వాసపల్లిపాడు సర్పంచిగా నీలి సుబ్బారావు విజయం

19:10 February 09

  • శ్రీకాకుళం: నిమ్మాడలో కింజరాపు సురేశ్‌ విజయం
  • గెలుపొందిన సురేశ్..‌ అచ్చెన్నాయుడు అన్న కుమారుడు

18:57 February 09

తొలిదశ ఎన్నికల నిర్వహణపై ఎస్​ఈసీ సంతృప్తి..

  • తొలిదశ ఎన్నికల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్‌ఈసీ
  • తొలిదశ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్‌ నమోదు: ఎస్‌ఈసీ
  • కృష్ణా జిల్లాలో అత్యధికంగా 85.06 శాతం పోలింగ్‌ నమోదు: ఎస్‌ఈసీ
  • గతంతో పోలిస్తే ఈసారి చాలా ప్రశాంతంగా ఎన్నికలు: ఎస్‌ఈసీ
  • ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు: ఎస్‌ఈసీ
  • మిగిలిన దశల్లోనూ ఇదే ఒరవడి కొనసాగాలి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
  • ప్రజాస్వామ్య బలోపేతం దిశగా ఇది శుభారంభం: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

18:54 February 09

  • కర్నూలు:చిన్నవంగలి సర్పంచిగా మౌలిభాషా గెలుపు
  • ప్రకాశం: లింగంగుంట సర్పంచిగా తూమాటి కల్యాణి విజయం
  • ప్రకాశం: సీతారాంపురం సర్పంచిగా మండవ శివానందరావు గెలుపు
  • ప్రకాశం: వెలగపూడి సర్పంచిగా కృష్ణారావు విజయం
  • ప్రకాశం: పాతపాడులో సర్పంచిగా కోదండరామిరెడ్డి విజయం
  • కడపజిల్లా: కొర్రపాటిపల్లె సర్పంచిగా కాసాలక్ష్మీ విజయం
  • కర్నూలు: మునగాల సర్పంచిగా మునగాల లోకేశ్‌రెడ్డి గెలుపు
  • కర్నూలు: రాయమల్పురం సర్పంచిగా పార్వతమ్మ గెలుపు
  • నెల్లూరు: ఎరుకులరెడ్డిపాలెం సర్పంచిగా మేకల విజయలక్ష్మి విజయం
     

18:42 February 09

  • చిత్తూరు: కొండ్రాజుకాల్వ సర్పంచిగా పరంధామనాయుడు గెలుపు
  • కడప: తుడుములదిన్నె సర్పంచిగా కృష్ణారెడ్డి విజయం
  • విశాఖ: కన్నంపాలెం సర్పంచిగా బర్ల తాతాలు గెలుపు
  • విశాఖ: లైన్ కొత్తూరు సర్పంచిగా కొల్లు రహానే విజయం

18:41 February 09

ఓటర్ల నుంచి మంచి స్పందన...

  • తొలిదశ ఎన్నికల్లో 81.66శాతం పోలింగ్ నమోదు: గిరిజాశంకర్‌
  • శ్రీకాకుళం, కడప మినహా మిగిలిన జిల్లాల్లో 80 శాతంపైగా పోలింగ్: గిరిజాశంకర్‌
  • ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది: గిరిజాశంకర్‌
  • స్వచ్ఛందంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు: గిరిజాశంకర్‌

18:33 February 09

  • చిత్తూరు: చీకూరుపల్లి సర్పంచిగా అమరావతి విజయం
  • చిత్తూరు: కరిడివారిపల్లి సర్పంచిగా ఆశ గెలుపు
  • చిత్తూరు: బొమ్మాయిపల్లె సర్పంచిగా గౌరమ్మ విజయం
  • చిత్తూరు: మంగళపల్లి సర్పంచిగా మురళి గెలుపు

18:31 February 09

  • విశాఖ: ఎల్. సింగవరం సర్పంచిగా వేపాడ మనీషా విజయం
  • కడప: తంగేడుపల్లె సర్పంచిగా లక్ష్మీదేవి గెలుపు

18:13 February 09

  • కర్నూలు: పాండురంగపురం సర్పంచిగా డోలావతమ్మ గెలుపు
  • కర్నూలు: పులిమద్ది సర్పంచిగా రఘురామరెడ్డి విజయం
     

18:12 February 09

  • ప్రకాశం: సీతారామపురం సర్పంచిగా శివానందరావు విజయం
  • ప్రకాశం: రాజుపాలెం సర్పంచిగా గర్నెపూడి కోటమ్మ గెలుపు

18:09 February 09

  • ఒంగోలు: దేవరంపాడు సర్పంచిగా నన్నపనేని వేంకటేశ్వర్లు విజయం

18:08 February 09

విశాఖ: పాపయ్యపాలెం సర్పంచిగా తలారి సత్యనారాయణ గెలుపు

18:06 February 09

  • గుంటూరు: కోతివానిపాలెం సర్పంచిగా కామేపల్లి పద్మావతి గెలుపు
  • కృష్ణా: జగన్నాథపురం సర్పంచిగా బండి విజయ్‌పాల్‌రెడ్డి గెలుపు

17:57 February 09

పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం

  • తూ.గో.: యు.కొత్తపల్లి మం. కొత్తపల్లిలో పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం
  • బ్యాలెట్ బాక్సు వదిలి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లిన సిబ్బంది
  • బ్యాలెట్ బాక్సు గురించి పోలింగ్‌ సిబ్బందికి తెలిపిన గ్రామస్థులు

17:02 February 09

కొససాగుతున్న ఓట్ల లెక్కింపు..

తొలివిడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపడుతున్నారు. మరికాసేపట్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. అనంతరం ఉపసర్పంచి ఎన్నిక నిర్వహిస్తారు.

15:59 February 09

  • 12 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం, కాసేపట్లో ఫలితాలు
  • ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచి ఎన్నిక
  • 2,723 పంచాయతీలు, 20,157 వార్డుల్లో పోలింగ్‌ పూర్తి
Last Updated : Feb 10, 2021, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details