ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఫలితం తేలేందుకు 24 గంటల సమయం పట్టే అవకాశం

mlc counting
mlc counting

By

Published : Mar 17, 2021, 7:24 AM IST

Updated : Mar 17, 2021, 1:05 PM IST

10:50 March 17

కాకినాడ జేఎన్టీయూలో కొనసాగుతున్న కౌంటింగ్

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి కాకినాడ జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా పరిశీలకులు శామ్యూల్ ఆనంద్ కుమార్, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు.

08:35 March 17

ఏపీలో కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

గుంటూరు ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
  • గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
  • గుంటూరు ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
  • కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ

08:34 March 17

తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం.. రాత్రికి తొలి రౌండ్​ ఫలితాలు!

తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 3,57,354 ఓట్లు పోల్​ కాగా వాటిని సరూర్‌నగర్‌లో లెక్కిస్తున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి పోల్ అయిన 3,86,320 ఓట్లను నల్గొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో లెక్కిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు బ్యాలెట్​ పేపర్లను కట్టలు కట్టనున్నారు. 25 బ్యాలెట్‌ పత్రాల చొప్పున కట్టలు కట్టనున్నారు. ఇవాళ రాత్రి 9.30 తర్వాత తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పెరిగిన పోలింగ్​తో పాటు జంబో బ్యాలెట్​తో కౌంటింగ్​ సవాల్​గా మారింది. దీంతో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. 3 షిఫ్టుల్లో ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం కౌంటింగ్‌ కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేసింది. ఒక్కో హాల్‌లో 7టేబుళ్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేసింది.

టేబుల్‌కు 1000 చొప్పున ఏకకాలంలో 56 వేల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో రోజు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు తేలకుంటే ఎలిమినేషన్ ప్రక్రియ ఉటుంది. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 144వ సెక్షన్ విధించారు.

06:04 March 17

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

  • ప్రారంభమైన గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
  • లెక్కింపునకు గుంటూరు ఏసీ కళాశాలలో ఏర్పాట్లు
  • ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో 93.06 శాతం పోలింగ్‌ నమోదు
  • ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడిన మొత్తం 19 మంది అభ్యర్థులు
  • మొత్తం 13,505 ఓట్లకు పోలైన ఓట్లు 12,556
  • ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు
  • ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న 14 బృందాలు
  • ఓట్ల లెక్కింపునకు సుమారు 24 గంటలు పట్టే అవకాశం
  • మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు సిబ్బంది నియామకం
Last Updated : Mar 17, 2021, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details