తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఏర్పాట్లు జీహెచ్ఎంసీ ముమ్మరం చేస్తోంది. మొత్తం 150 డివిజన్లు సంబంధించి 30 డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, మీర్‌పేట హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్లకు సంబంధించిన ఓట్ల డీఆర్సీ కేంద్రాన్ని నాచారం రోడ్‌లోని శ్రీ చైతన్య స్కూల్లో ఏర్పాటు చేశారు. చిలుకానగర్, హబ్సీగూడ, రామంతపూర్, ఉప్పల్ డివిజన్ డీఆర్సీ కేంద్రం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేశారు.
విక్టోరియా... ఇండోర్ స్టేడియంలో...
నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌కు సంబంధించిన డీఆర్సీ హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ విద్యాసంస్థలో ఏర్పాటు చేశారు. వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట, లింగోజీగూడ డివిజన్లకు సంబంధించిన డీఆర్సీ సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్‌లో ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్, ఆర్కేపురం, కొత్తపేట, చైతన్యపురి, గడ్డి అన్నారం డివిజన్లకు సంబంధించి డీఆర్సీని సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. సైదాబాద్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్, అక్బర్‌బాగ్, అజంపుర, చావని, డబీర్‌పుర డివిజన్ కేంద్రాలకు డీఆర్సీ అంబర్‌పేట్‌లోని ఇండోర్ స్టేడియంలో జరగనుంది.
మహవీర్ ఇనిస్టిట్యూట్, అరోరా అకాడమీలో..
రెయిన్‌బజార్, తాలాబ్చంచలం, గౌలిపుర, కుర్మగూడ, ఐఎస్ సదన్, సంతోష్ నగర్ డివిజన్లకు సంబంధించి బండ్లగూడలోని మహవీర్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేశారు. లలితాబాగ్, రియాసత్‌నగర్, కంచన్‌బాగ్,బార్కాస్, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, జంగమ్మెట్ డివిజన్ కేంద్రాల డీఆర్సీ బండ్లగూడలోని అరోరా అకాడమీలో చేశారు. పత్తర్ఘాటీ, మొఘల్‌పుర, షాలిబండ, ఝాన్సీ బజార్, పురానాపూల్ డివిజన్లు సంబంధించిన డీర్సీని హైకోర్టు రోడ్‌లోని ప్రభుత్వ సిటీ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఫలక్‌నుమా, నవాబ్ సాహెబ్ కుంట, దూద్ బౌలి, జహానుమా, రాంనాస్త్పురా, కిషన్‌బాగ్ డీఆర్సీని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌లో జరగనుంది.
డివిజన్ల వారీగా...
రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల డీఆర్సీలో సులేమాన్ నగర్, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్లకు సంబంధించిన డివిజన్ల ఓట్ల లెక్కింపు చేయనున్నారు. మసబ్ ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల డీఆర్సీలో మెహదీపట్నం, గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్, విజయ్‌నగర్ కాలనీ, అహ్మద్‌నగర్, రెడ్‌హిల్స్, మల్లేపల్లి డివిజన్లు ఉండనున్నాయి. ఎల్బీ స్టేడియం బాక్సింగ్ హాల్ డీఆర్సీ కేంద్రంలో బేగంబజార్, గోషామహల్, మంగళ్‌హట్, దత్తాత్రేయ నగర్, జాంబాగ్, గన్‌ఫౌండ్రీ డివిజన్లు రానున్నాయి.