Cotton Prices Record in Telangana : తెలంగాణ పత్తికి భారీ డిమాండ్.. క్వింటాకు 10వేలు దాటిన గరిష్ఠ ధర
Cotton Prices Record in Telangana : తెలంగాణలో తెల్లబంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. పత్తి క్వింటా గరిష్ఠ ధర బుధవారం రోజున రూ.10వేలు దాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు వ్యవసాయ ఉపమార్కెట్లో గరిష్ఠ ధర రూ.10,200 పలికింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నడు లేని విధంగా క్వింటా పత్తిని రూ.9800లకు కొనుగోలు చేశారు.
Cotton Prices Record in Telangana
By
Published : Jan 6, 2022, 9:46 AM IST
Cotton Prices Record in Telangana : తెలంగాణలో తెల్లబంగారం క్వింటా గరిష్ఠ ధర బుధవారం రూ.పదివేలు దాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు వ్యవసాయ ఉప మార్కెట్‌లో గరిష్ఠ ధర రూ.10,200 పలికింది. మొత్తం 18,00 క్వింటాళ్ల సరకు వచ్చింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రూ.10వేలు పలికింది. ఇక్కడ కనిష్ఠధర రూ.6,400 కాగా నమూనా ధర రూ.9,800 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్‌కు మొత్తం 4,442 బస్తాల పత్తి వచ్చింది.
డిమాండ్ పెరిగింది..
Cotton Prices Record in Kothagudem : మంగళవారం క్వింటా పత్తి గరిష్ఠధర రూ.9,700 ఉండగా మరో రూ.300 పెరగడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దిగుబడులు లేకపోవటం, మరోవంక.. అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడటంతో ఇప్పుడు పత్తికి అనూహ్యంగా ధరలు పెరుగుతున్నాయి. వచ్చిన సరకును వచ్చినట్లు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు.
రైతుల సంబురాలు..
Cotton Prices Record in Warangal : తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దదైన ఖమ్మం మార్కెట్‌కు ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి రైతులు పత్తి తెస్తుంటారు. పత్తి యార్డులో పాలకవర్గం, అధికారులు, సిబ్బంది, రైతులతో కలిసి బుధవారం రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ డౌలె లక్ష్మీప్రసన్న, వైస్‌ఛైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు రైతులను సన్మానించారు.
ఆనందంలో పత్తి రైతులు..
Cotton Crop Prices Record in Telangana : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెల్లబంగారానికి గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి ధర పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ విపణిలో బేళ్లకు, గింజలకు మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు కూడా పోటీ పడి ధర పెంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే క్వింటా 8500 రూపాయల నుంచి 9800 రూపాయల వరకు కొనుగోలు చేశారు. ఇలానే కొనసాగితే క్వింటా పత్తి ధర పది వేల రూపాయల పైన పలికే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధరతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడి లేక..పెరిగిన ధరలు..
Cotton Crop Prices Record in Telangana Today : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల ఎకరాల్లో పత్తి సాగయింది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది. వర్షాల ప్రభావం.. పత్తికి వచ్చే చీడపీడల కారణంగా ఈ ఏడాది దిగుబడి పడిపోయిందని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల ఎకరాకు మూడు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి వస్తే.. కొన్ని చోట్ల అదీ రాలేదని అన్నారు. పంట పెట్టుబడి కింద అప్పులు చేసిన రైతులు.. రికార్డు స్థాయిలో పత్తికి అధిక ధర పలుకుతున్నా.. పంట దిగుబడి రాక దిగాలు పడుతున్నారు.