రాష్ట్రంలో 386కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - corona cases ap
08:22 April 11
386కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 386కు చేరాయి. ఇవాళ కర్నూలు జిల్లాలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఈ ఐదు కేసులతో కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 82కు చేరిందని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. దిల్లీ మర్కజ్ వెళ్లివచ్చిన 108 మంది రక్త నమూనాలు పరీక్షించగా.. 103 మందికి నెగిటివ్, ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో 381కి చేరిన కరోనా కేసులు