రాష్ట్రం (Andhrapradesh)లో ఇప్పటివరకూ కోటిమందికిపైగా కొవిడ్ టీకా (covid vaccine) తీసుకున్నారు. కోటి 74 వేల 471 మందికి డోసులు వేశామని.. వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కొవాగ్జిన్ (covaxin), కొవిషీల్డ్ (covishield) కలిపి ఇప్పటివరకూ 98 లక్షల 85 వేల 650 డోసులను కేంద్రం అందించిందని, 16 లక్షల 85 వేల 630 టీకాలను (vaccine) రాష్ట్రం కొనుగోలు చేసిందని వెల్లడించారు.
ఇప్పటివరకూ 82 లక్షల 95 వేల 973మందికి కొవిషీల్డ్, 17 లక్షల 78 వేల 218 మందికి కొవాగ్జిన్ డోసులు వేసినట్లు వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ వివరించారు. ఆరోగ్యకార్యకర్తల చిత్తశుద్ధితో ఎక్కడా టీకా వృథా కాలేదని.. దీంతో అదనంగా సుమారు 2 లక్షల మందికి టీకా అందించగలిగామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరు కరోనా టీకా ఒకటీ లేదా రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు.