ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వినూత్న ప్రచారం... టీకా వేసుకోవాలంటూ మైక్ ద్వారా పిలుపు - vaccination campaign in mallapur

మైక్ వినిపిస్తే గతంలో ఊళ్లలో సినిమా ప్రచారం అనుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. కూరగాయలు, పండ్లు అమ్మేవారు, రిపేర్లు చేసేవారు మైకులో చెప్పుకుంటూ ఊరూరు తిరుగుతున్నారు. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మల్లాపూర్​లో ఇవాళ మైకులో జరిగిన ప్రచారం అందరిని ఆకర్షించింది.

వినూత్న ప్రచారం
వినూత్న ప్రచారం

By

Published : Sep 24, 2021, 10:14 PM IST

వినూత్న ప్రచారం

కరోనా మహమ్మారి(Corona Pandemic) నుంచి రక్షణ పొందేందుకు తెలంగాణ వ్యాప్తంగా లక్షల మంది వ్యాక్సిన్(Vaccine)​ తీసుకుంటున్నా కొంతమందిని మాత్రం ఇంకా అపోహలు వీడటం లేదు. లేనిపోని భయాలతో టీకా వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో 100శాతం వ్యాక్సినేషన్ మాట ఉంచి.. మళ్లీ మహమ్మారి విజృంభించే అవకాశం ఉంది. అందుకే తమ వంతుగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి తెలంగాణలోని కరీంనగర్​ జిల్లా మల్లాపూర్​(Mallapur)లో వైద్య సిబ్బంది వినూత్న ప్రయత్నం చేశారు.

మైకులో 'రావాలమ్మ రావాలి' అంటూ వినూత్నంగా ప్రచారం చేశారు. టీకా పట్ల ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. అందరూ టీకా తీసుకుంటే కరోనా(Corona) బారి నుంచి సురక్షితంగా బయటపడవచ్చవని సూచించారు. ఆటో సహాయంతో మల్లాపూర్​లోని అన్ని వీధుల్లో మైకు ద్వారా ప్రచారం చేశారు. టీకా వేసుకోని వారికి అక్కడే వ్యాక్సిన్(corona vaccine)​ వేస్తూ ముందుకు సాగారు. నూరు శాతం వ్యాక్సినేషన్​(100 Percent Vaccination) లక్ష్యం పూర్తి చేయాలనే వైద్య సిబ్బంది సంకల్పం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి:ZPTC ELECT : రేపు జెడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక.. వెంటనే ప్రమాణస్వీకారం!

ABOUT THE AUTHOR

...view details