Corona cases: కొత్తగా 1,433 కరోనా కేసులు, 15 మరణాలు - రాష్ట్రంలో కరోనా కేసులు తాజా సమాచారం
17:05 August 18
Corona cases
రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,433 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,815 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 15,944 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 68,041 కరోనా పరీక్షలు చేశారు. కరోనాతో అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండీ..Viveka Murder Case: వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్కు రిమాండ్ పొడిగింపు