ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 10,601 కరోనా కేసులు, 73 మంది మృతి - covid cases in andhra pradesh

రాష్ట్రంలో కొత్తగా 10,601 కరోనా కేసులు, 73 మంది మృతి
రాష్ట్రంలో కొత్తగా 10,601 కరోనా కేసులు, 73 మంది మృతి

By

Published : Sep 8, 2020, 6:21 PM IST

Updated : Sep 8, 2020, 8:46 PM IST

18:19 September 08

5,17,094కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

రాష్ట్రంలో కొత్తగా 10,601 కరోనా కేసులు, 73 మంది మృతి

ఆంధ్రప్రదేశ్​లో కరోనా తీవ్రత అదే స్థాయిలో కొనసాగుతోంది. రెండు వారాలుగా పదివేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.  24 గంటల వ్యవధిలో 10,601 కరోనా కేసులు నమోదయ్యాయి. 73 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5,17,094కు చేరింది. ఇప్పటివరకు 4,560 మంది కరోనాతో చనిపోయారు. వ్యాధి సోకిన వారిలో  4,15,765 మంది కోలుకోగా.. ప్రస్తుతం 96,769 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో  ఏపీలో 70,993 కరోనా పరీక్షలు నిర్వహించారు.  గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 10, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాల్లో 8, కడప, ప్రకాశం జిల్లాల్లో 7, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో 6, తూ.గో., కృష్ణా, ప.గో. జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లా, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు.  

అంతకంతకూ పెరుగుదల  

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 20 రోజులుగా రోజుకు వెయ్యి కేసులకు పైగానే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 70వేల మందికి ఈ జిల్లాలో కరోనా సోకింది. మంగళవారం కూడా 1426 కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1457  కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే... చిత్తూరు జిల్లాలో 1178, ప.గో. జిల్లాలో 1122, నెల్లూరు జిల్లాలో 1042, కడప జిల్లాలో 801, గుంటూరు జిల్లాలో 702, విజయనగరం జిల్లాలో 598, కర్నూలు జిల్లాలో 514, శ్రీకాకుళం జిల్లాలో 505, విశాఖ జిల్లాలో 426, కృష్ణా జిల్లాలో 389 కరోనా పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి.  

రెండో స్థానంలో  

5లక్షలకుపైగా కేసులతో ఏపీ ఇప్పటికే మహరాష్ట్ర తర్వాత రెండోస్థానంలో కొనసాగుతోంది. పాజిటివిటీ రేట్​లో కూడా ద్వితీయ స్థానంలోనే ఉంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 12.20 గా నమోదైంది. ఇప్పటివరకూ 42, 37,070 పరీక్షలు నిర్వహించారు.  

లక్షణాలు లేనివారిలోనూ...

కరోనా తీవ్రతను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాండమ్ యాంటీజెన్ టెస్టుల ఫలితాల్లోనూ తీవ్రత అధికంగానే ఉంటుంది. కరోనా లక్షణాలు ఏమాత్రం లేనివారిని ఎంపిక చేసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, కూరగాయల విక్రేతలు, 60 ఏళ్లకు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు.. ఇలా 15 రకాల కేటగిరీల ప్రజలను ఎన్నుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో 13.5శాతం మంది పాజిటివ్ గా తేలారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 6 వరకూ మొత్తం 8,40, 023మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 93,100 మందికి పాజిటివ్ అని తేలింది. అంటే ఏ లక్షణాలూ లేని వారిలో కూడా దాదాపు 15శాతం కరోనా ఉంటున్నట్లు అర్థమవుతోంది.  

Last Updated : Sep 8, 2020, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details