కరోనా బారినపడిన ఉద్యోగులు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంది. బస్సుల్లో విధులు నిర్వహిస్తూ కరోనా మహమ్మారి సోకిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంస్థ నిర్ణయించింది. వ్యాధి సోకిన ఆర్టీసీ ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు ఆమోదం తెలిపింది. ఉద్యోగి, సహా కుటుంబ సభ్యుల వైద్యానికయ్యే ఖర్చు మొత్తాన్ని చెల్లించేందుకు సంస్ధ అంగీకారం తెలిపుతూ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత అధికారులకు ఈ మేరకు ఆర్టీసీ ఈడీ ఎ.కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించారు.