రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,855 కరోనా పాజిటివ్ కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,54,385కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 5,558 మంది మృతిచెందారు. ప్రస్తుతం 69,353 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,79,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 76,000 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 53,78,367 పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా కరోనా మృతులు
వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం... చిత్తూరు జిల్లాలో 8, అనంతపురం జిల్లాలో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, కడప, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున కొవిడ్ బారిన పడి మరణించారు. 24 గంటల వ్యవధిలో విజయనగరం జిల్లాలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,095 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 992, ప్రకాశం జిల్లాలో 927, చిత్తూరు జిల్లాలో 902, గుంటూరు జిల్లాలో 551 కరోనా కేసులు వచ్చాయి. కడప జిల్లాలో 545, అనంతపురం జిల్లాలో 497, శ్రీకాకుళం జిల్లాలో 461, విశాఖ జిల్లాలో 425, నెల్లూరు జిల్లాలో 405, విజయనగరం జిల్లాలో 384, కృష్ణా జిల్లాలో 346, కర్నూలు జిల్లాలో 325 కరోనా కేసులు వచ్చాయి.
ఇదీ చదవండి : ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా..?: ఎంపీ రఘురామ