ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బంజారాహిల్స్​లో కరోనా కలకలం... 11 మంది పోలీసులకు పాజిటివ్ - corona to banjara hills police

హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో కరోనా కలవరపెడుతోంది. స్థానిక ఠాణాలో 11 మంది పోలీసులు వైరస్ నిర్థరణ కావడం ఆందోళన కలిగిస్తోంది.

corona-to-11-policemen-in-banjara-hills-polisce-station
బంజారాహిల్స్​లో కరోనా కలకలం... 11 మంది పోలీసులకు పాజిటివ్

By

Published : Apr 5, 2021, 7:38 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 11 మంది పోలీసులకు కొవిడ్‌ సోకింది. సీఐ, ఎస్సైతో పాటు మరో 9 మంది కానిస్టేబుళ్లకు వైరస్‌ నిర్ధరణ అయింది.

మొదటి దశ కొవిడ్​ సమయంలోనూ ఇదే స్టేషన్​లో 50 మంది సిబ్బంది వైరస్​ బారిన పడ్డారు. కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో... సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఉన్నతాధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details