ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా: అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - Corona effect on AP

కరోనా కేసులు ఉద్ధృతమవుతోన్న దృష్ట్యా ఆస్పత్రుల్లో అదనంగా సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. 6 నెలల పాటు కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్​ను ప్రభుత్వం ఆదేశించింది.

అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

By

Published : Apr 25, 2021, 8:07 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు ఉద్ధృతమవుతోన్న దృష్ట్యా ఆస్పత్రుల్లో అదనంగా సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లను పెంచేందుకు, అందుకు తగ్గట్లుగా వైద్య సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1170 స్పెషలిస్టులు, 1170 జనలర్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 306 మంది అనస్తిషియా టెక్నీషియన్లు, 300 మంది ఎఫ్​ఎన్​ఓలు, 300 మంది ఎమ్​ఎన్​వోలు, 300 మంది స్వీపర్లను 6 నెలల పాటు కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని... రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్​ను ప్రభుత్వం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details