రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సచివాలయంలోని ఉద్యోగులకు కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే చేసిన పరీక్షల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తొలి విడతలో టెస్టులు చేయని వారికి ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో వచ్చిన వైద్య సిబ్బంది ఉద్యోగుల నమూనాలు తీసుకున్నారు. ప్రస్తుతం సచివాలయంలో 2500 మంది విధుల్లో ఉన్నారు. వీరికి టెస్టులు చేయడం పూర్తయ్యాక భద్రతా సిబ్బందికి పరీక్షలు చేయనున్నారు.
సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు - ఏపీ సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షల వార్తలు
సచివాలయ ఉద్యోగులకు మలి విడత కరోనా టెస్టులు చేస్తున్నారు. తొలి విడతలో చేసిన పరీక్షల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం సచివాలయంలో 2500 మంది విధులు నిర్వహిస్తున్నారు.
సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు
TAGGED:
ap secretariat