ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త జంటలకు పరీక్షలు..కరోనా కాలం బాసూ..! - corona tests to newly married couple in pulluru checkpost

లాక్​డౌన్​ నేపథ్యంలో వివాహాలు జరిపేందుకు పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులకు అనుమతిస్తున్నారు. అలా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చిన రెండు జంటల వివరాలును తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు చెక్​పోస్టు అధికారులు సేకరించారు.

corona tests for newly married
కొత్త జంటలకు కరోనా పరీక్షలు

By

Published : May 15, 2020, 4:47 PM IST

కరోనా ప్రభావంతో వివాహ వేడుకకు అర్థమే మారిపోయింది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలుతో పరిణయ వేడుక పరిమిత కుటుంబసభ్యుల సమక్షంలోనే జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో పెళ్లి చేసుకునే తెలంగాణ వాసులు సరిహద్దు చెక్​పోస్టు గుండా ప్రవేశించాల్సిందే. ఇలా పరిమిత సంఖ్యలో వెళ్లి వివాహ వేడుక చేసుకుని వస్తున్న నూతన జంటలకు చెక్​పోస్టుల వద్ద వివరాలు నమోదు చేయించుకుంటున్నారు.

తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు చెక్​పోస్టు వద్ద రెండు నూతన జంటలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఉండవల్లి మండలం మారుమునగాలకు చెందిన జంటకు ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లాలో వివాహం జరిగింది. మరొకరు మల్దకల్​ మండలం పెద్దొడి గ్రామానికి చెందిన జంట కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలుకా గోవిందపల్లి గ్రామంలో పెళ్లి చేసుకుని వచ్చారు. చెక్​పోస్టు వద్ద ఉన్న అధికారులు... నూతన వధూవరులు, కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేసుకుని వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్​ ముద్ర వేసి పంపిస్తున్నారు.

ఇవీ చూడండి:తడిసిన నయనం.. ఆగని పయనం

ABOUT THE AUTHOR

...view details