హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగికి కరోనా సోకడంతో.... రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులందరికీ కొవిడ్-19 నిర్దరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండో బ్లాక్లో ఉన్న హోం, రెవిన్యూ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులకు పరీక్షలు చేస్తున్నారు. వరుసగా మూడు రోజుల పాటు సచివాలయంలోని ఉద్యోగులందరికీ వైద్యారోగ్య శాఖ పరీక్షల నిర్వహించనుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉద్యోగులు 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా సర్క్యూలర్ జారీ అయ్యింది.
సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు - covid news in ap
రాష్ట్ర సచివాలయంలో కొవిడ్-19 కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగికి కరోనా సోకటంతో.. సచివాలయంలోని ఉద్యోగులందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు.
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు