ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేట్​ ల్యాబ్​లో కరోనా నిర్థరణ పరీక్ష ధర రూ.1900 - ఏపీలో కరోనా కేసులు

కరోనా నిర్ధరణ పరీక్షలకు సంబంధించిన ధరల్ని తగ్గిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.2400 ఉన్న ధరను రూ.1600 కు తగ్గించింది. ప్రైవేటు ల్యాబుల్లో రూ.2900 ఉన్న ధరను రూ.1900 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

corona test rates
corona test rates

By

Published : Aug 27, 2020, 4:19 PM IST

కరోనా నిర్ధరణ పరీక్షలకు సంబంధించిన ధరల్ని తగ్గిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పంపిన నమూనాల పరీక్షకు 2400 రూపాయలుగా ఉన్న ధరను 1600 రూపాయలకు తగ్గించారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ .జవహర్ రెడ్డి ఈ ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేటు ల్యాబ్​ల్లో పరీక్షచేయించుకునే వారి కోసం నిర్దేశించిన 2900 రూపాయల ధరను 1900 రూపాయలకు తగ్గించారు.

బహిరంగ మార్కెట్​లో ఆర్టీపీసీఆర్ కిట్ల ధరలు తగ్గిన కారణంగానే నిర్ధరణ పరీక్షల ధరల్ని తగ్గించినట్టు వైద్యారోగ్యశాఖ తెలియచేసింది. మరోవైపు ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే అనుమతి పొందిన ల్యాబ్ లు నిర్ధరణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు ల్యాబ్​లు వసూలు చేస్తున్న ధరలపై దృష్టి సారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!

ABOUT THE AUTHOR

...view details