ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెల్లవారితే పెళ్లి.. ఇంతలోనే ఏం జరిగిందంటే..? - corona cases in ap

ఆ ఇంట్లో తెల్లవారితే పెళ్లి బాజాలు మోగేవి. ఇంట్లో అంతా వివాహ సందడి ఉండేది. మరికొన్ని గంటల్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యేవి. పెళ్లి కూతురు తండ్రికి కొద్దిగా అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. వివాహ వేడుకలను వాయిదా వేశారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లిలో చోటు చేసుకుంది.

corona-symptoms-
corona-symptoms-

By

Published : Aug 8, 2020, 11:04 PM IST

తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఓ ఇంట్లో ఆదివారం వివాహ వేడుకలను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం మరికొన్ని గంటల్లో పెళ్లి పనులు ప్రారంభమవుతాయనుకున్నారు. ఇంటిని రంగులతో చక్కగా అలంకరించారు. అయితే పెళ్లి కూతురు తండ్రి గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా... ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటం వల్ల కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రిలో చేరారు.

పరీక్షించిన వైద్యులు సదరు యువతి తండ్రి నుంచి కొవిడ్‌ పరీక్షల కోసం శాంపిళ్లను సేకరించారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే యువతీ కుటుంబీకులను సైతం పరీక్షల నిమిత్తం అధికారులు కరీంనగర్‌ సివిలాసుపత్రికి తరలించారు. దీంతో ఆదివారం జరగాల్సిన పెళ్లిని వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details