కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఫిబ్రవరి 10వ తేదీ తరువాత విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య వివరాలను బుధ, గురువారాల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్‌ఎంల ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా జరగనుంది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను ‘థర్మల్ స్కాన్’ ద్వారా పరీక్షిస్తున్నారు. నౌకలు, ఓడల్లో వచ్చే వారి విషయంలోనూ ఇటువంటి జాగ్రత్తలనే తీసుకుంటున్నారు.
కరోనా: విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా..? - corona latest news
ఫిబ్రవరి 10వ తేదీ తరువాత విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు.
హైదరాబాద్, ముంబై, చెన్నై, ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి వచ్చినవారు డొమెస్టిక్, రోడ్డు, రైళ్ల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాలు ప్రతి ఇంటికి వెళ్లి ‘మీ ఇంటికి ఫిబ్రవరి 10వ తేదీ తరువాత విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా..? జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారా..?’ అన్న వివరాలను మొబైల్ అప్లికేషన్‌లో అవును/కాదు అన్న రూపంలో నమోదు చేస్తారు.
ఇదీ చదవండీ... 'ఇటలీ నుంచి వచ్చిన వారు ఇంటికే పరిమితం కావాలి'