ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ర్యాండమ్‌ పరీక్షల్లో.. 3.54% మందికి పాజిటివ్‌ - rapid tests for corona

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతను తెలుసుకునేందుకు జూన్‌ ఆఖరి నుంచి ఈ నెల 18 వరకూ 13 జిల్లాల్లో 2,69,728 మంది నుంచి ర్యాండమ్‌గా నమూనాల్ని సేకరించి పరీక్షించారు. వీటిలో 48,607 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. 24,146 తిరస్కరణకు గురయ్యాయి. ఫలితాలు వెల్లడైన నమూనాల్లో 3.54% మందికి కరోనా సోకినట్లు తేలింది.

corona tests ap
corona tests ap

By

Published : Jul 22, 2020, 11:42 AM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతను తెలుసుకునేందుకు జూన్‌ ఆఖరి నుంచి ఈ నెల 18 వరకూ 13 జిల్లాల్లో 2,69,728 మంది నుంచి ర్యాండమ్‌గా నమూనాల్ని సేకరించి పరీక్షించారు. వీటిలో 48,607 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. 24,146 తిరస్కరణకు గురయ్యాయి. ఫలితాలు వెల్లడైన నమూనాల్లో 3.54% మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈనెల 3 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,16,204 నమూనాలు సేకరించగా 1,734 (1.49%) మందికి వైరస్‌ సోకింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, భవననిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, మార్కెట్‌ యార్డులు, వైద్య ఆరోగ్యశాఖ సహా మరో 15 విభాగాల ఉద్యోగుల నమూనాలను జిల్లా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది సేకరించారు. వీరిలో అనుమానిత లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయడంతో వైరస్‌ వ్యాప్తి తీవ్రత వెల్లడైంది.

నెగెటివ్‌ వచ్చినా...5 వేల మందికి పరీక్షలు
ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌గా తేలినా.. లక్షణాలున్న 5వేల మంది నమూనాలను ఆర్టీపీసీఆర్‌ ప్రయోగశాలల్లో పరీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఈనెల మొదటి నుంచి సోమవారం వరకూ 41,499 మందికి యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 5,384 మందికి కరోనా సోకింది. మరో 7,337 నమూనాల ఫలితాలు రావాలి. మిగిలిన వారికి నెగెటివ్‌ వచ్చింది. వీరిలో లక్షణాలున్న 5వేల మంది నమూనాలను ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లకు పంపారు. ఫలితాలు రావాల్సి ఉంది. యాంటీజెన్‌ పరీక్షలో పాజిటివ్‌ వస్తే వైరస్‌ సోకినట్లే. నెగెటివ్‌ వచ్చినా లక్షణాలుంటే మళ్లీ ట్రూనాట్‌ లేదా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details