Omicron cases in Telangana:తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల నమోదుతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇటీవల కెన్యా, సోమాలియా దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధరణ కావడంతో.. బాధితులను చికిత్స నిమిత్తం టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని పారామౌంట్ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ కాలనీలో కరోనా ఆంక్షలు విధిస్తూ.. 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసింది.
Omicron cases in Telangana: ఒమిక్రాన్ ఎఫెక్ట్... హైదరాబాద్‌లో కరోనా ఆంక్షలు - తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల నమోదుతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని పారామౌంట్ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ కాలనీలో కరోనా ఆంక్షలు విధిస్తూ.. 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసింది.
Omicron
ఈ నెల 12 న సోమాలియా నుంచి రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వచ్చిన యువకుడికి జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. టోలిచౌకికి చెందిన ఆ వ్యక్తి ఆచూకీని పోలీసులు పారామౌంట్ కాలనీలో గుర్తించారు. వెంటనే బాధితుడిని టిమ్స్‌కు తరలించారు. దీంతో ఆ కాలనీలో ప్రభుత్వం కరోనా ఆంక్షలు విధించింది.
ఇదీ చదవండి:'ఒమిక్రాన్ వ్యాప్తి 70రెట్లు ఎక్కువ.. కానీ ఆ విషయంలో మాత్రం వీక్!'