తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏప్రిల్, మే నెలల్లో కేసుల సంఖ్య బాగా పెరిగినా.. లాక్డౌన్, ప్రజల అప్రమత్తతతో క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో ఇవాళ 1,21,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 987 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మహమ్మారి బారిన పడి మరో ఏడు మరణించారు. రాష్ట్రంలో 1,362 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 13,487 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా రికవరీ రేటు 97.24 శాతానికి చేరింది.
TELANGANA: తెలంగాణలో 97.24 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు - total number of corona cases in telangana
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఇవాళ 1,21,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 987 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనా రికవరీ రేటు 97.24 శాతానికి చేరింది.
తెలంగాణలో 97.24 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు