రాష్ట్ర వ్యాప్తంగా ర్యాండమ్ టెస్టుల నిర్వహణకు వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. నమూనాల సేకరణ పెంచాలని నిర్ణయించింది. రెడ్‌జోన్లు, కంటైన్మెంటు క్లస్టర్లు సహా ఇతర ప్రాంతాల్లో నమూనాల సేకరించాలని అధికారులను ఆదేశించింది. ఇళ్ల వద్దకే వెళ్లి కరోనా వైరస్ పరీక్షలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అపోహలకు గురికావొద్దని సూచనలు జారీచేసిన వైద్యారోగ్యశాఖ... ధైర్యంగా నమూనాలు ఇచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని కోరింది. పరిసరాల్లో అనుమానితుల వివరాలు తెలియజేసి పరీక్షించేలా సహకరించాలని సూచించింది. పరీక్షల అనంతరం క్వారంటైన్ లేదా ఆస్పత్రికి తరలించే అవకాశం లేదని ప్రకటించింది. వైద్యులే వచ్చి ఉచితంగా మందులు ఇస్తారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ర్యాండమ్ టెస్టులు - ఇళ్ల వద్దే కరోనా పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా ర్యాండమ్ టెస్టులు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. రెడ్‌జోన్లు, కంటైన్మెంట్లు సహా ఇతర ప్రాంతాల్లో నమూనాలు సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల వద్దే పరీక్షలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరింది. అనుమానితుల వివరాలు తెలిపి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు