కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య అధికమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఆదివారం కరోనా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ మహమ్మారి బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని, వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని యడియూరప్ప వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన కోరారు.
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా పాజిటివ్ - corona virus
కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా నిర్ధరణ అయినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని సామాజిక మాధ్యమం ద్వారా చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప