ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఆస్పత్రి మెట్ల మీదే ప్రాణాలొదిలిన కరోనా బాధితుడు - తెలంగాణలో విషాదం

ఒంట్లో నలతగా ఉంది... కరోనా వచ్చిందేమోనని పరీక్షకు వెళ్లాడు. కరోనా పరీక్షల్లో పాజిటివ్​ అని తేలింది. ఫలితం చూసి పూర్తిగా నీరసపడిపోయిన ఆ బాధితుడు... ఆస్పత్రి మెట్లపైనే కూర్చుండి పోయాడు. అసలే అనారోగ్యంతో ఒంట్లో సత్తువ లేదు... దానికి తోడు కరోనా అని తేలటంతో మనోధైర్యం కోల్పోయిన నర్సింహా కూర్చున్నచోటే తుదిశ్వాస విడిచాడు.

ఆస్పత్రి మెట్ల మీదే ప్రాణాలొదిలిన కరోనా బాధితుడు
ఆస్పత్రి మెట్ల మీదే ప్రాణాలొదిలిన కరోనా బాధితుడు

By

Published : Apr 29, 2021, 7:58 PM IST

ఆస్పత్రి మెట్ల మీదే ప్రాణాలొదిలిన కరోనా బాధితుడు

తెలంగాణలోని వనపర్తి జిల్లా వీపనగండ్లలో విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ జరిగిన ఓ వ్యక్తి కూర్చున్నచోటే కుప్పకూలాడు. దగడపల్లికి చెందిన నర్సింహ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో ఉదయం వీపనగండ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షలు చేయించుకోగా.. వైరస్‌ ఉందని నిర్ధరణ అయింది.

తనకు కొవిడ్‌ సోకిందనే బాధలో ఆస్పత్రి మెట్లపైనే కూర్చుండిపోయాడు. అసలే అస్వస్థత... ఆపై కరోనా వచ్చిందనే భయంతో... మనోధైర్యం కోల్పోయాడు. అందరూ చూస్తుండగానే... కూర్చున్న చోటే తుదిశ్వాస విడిచాడు. ఈ హృదయ విదారక ఘటన అక్కడున్నవాళ్లను తీవ్రంగా కలచివేసింది. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిబంధనలు పూర్తిచేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదీ చూడండి:

'కరోనా పరీక్షల ఫలితాలు ప్రతిరోజు వచ్చేలా చర్యలు తీసుకోవాలి'

మినీపోరులో గెలుపెవరిది? కాసేపట్లో ఎగ్జిట్​పోల్స్ ఫలితాలు​

ABOUT THE AUTHOR

...view details