Telangana Corona Cases Today: అంతర్జాతీయ ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన వారి కదలికలపై నిఘా వేయడంలో తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణయిన సోమాలియాకు చెందిన వ్యక్తి రెండు రోజులపాటు యథేచ్ఛగా నగరంలో ఆస్పత్రుల చుట్టూ తిరగడమే దానికి నిదర్శనం. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత 14 రోజులపాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండగా, ఆ నిబంధనలను ఎక్కువమంది పాటించడం లేదు. ఇతని విషయంలోనూ అదే జరిగిందని, వైద్యసిబ్బంది అలసత్వంగా వ్యవహరిస్తుండటమే దానికి కారణమనే ఆరోపణలున్నాయి
Omicron Variant Telangana : నిజానికి అంతర్జాతీయ ప్రయాణికుల్లో పాజిటివ్‌లుగా నిర్ధారణయిన వారి సంఖ్య స్వల్పంగానే ఉంటోంది. ఆ కొద్దిమందిపైనా నిఘా వేయకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఉదాహరణకు ముప్పులేని దేశం నుంచి వచ్చిన మరో వ్యక్తికి 12వ తేదీన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ర్యాండమ్ ఆర్టీపీసీఆర్ చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. 14వ తేదీన జన్యుక్రమ విశ్లేషణలో ఒమిక్రాన్ నిర్ధారణయింది. 15వ తేదీ మధ్యాహ్నం వరకు అతని ఆచూకీని అధికారులు తెలుసుకోలేకపోయారు. 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అతనిపై ఎందుకు నిఘా వేయలేకపోయారు? అతని కదలికలను ఎందుకు నియంత్రించలేకపోయారనేది ప్రశ్నార్థకమే. ఈ కాలంలో ఆ వ్యక్తి ద్వారా ఎంతమందికి ఒమిక్రాన్ సోకి ఉంటుందోననే ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇలా అతనొక్కడే కాదు.. పలువురు అంతర్జాతీయ ప్రయాణికులు పాజిటివ్ నిర్ధారణయినప్పటికీ ఐసొలేషన్‌లో ఉండడం లేదనే అనుమానాలు న్నాయి. ముప్పున్న దేశాల నుంచి వచ్చి నెగిటివ్‌గా తేలినన వారు కూడా హోం ఐసోలేషన్‌లో ఉండేలా చూడాలి. ఎనిమిది రోజుల తర్వాత మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలి. అదీ సక్రమంగా జరగడం లేదు.
వెలుగుచూస్తున్న పాజిటివ్ కేసులు