ఈఎస్ఐ కేసులో అరెస్టైన పితాని సత్యనారాయణ మాజీ పీఎస్మురళీమోహన్కుకరోనా సోకింది. ఈఎస్ఐ ఔషధాల అవతవల కేసులో ఆయన్ను జులై 10న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఇటీవల పోలీసులు మాజీ పీఎస్ ను విచారించేందుకు కస్టడీకి తీసుకున్నారు. ఐదు రోజుల విచారణ అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లే సమయంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంట్లో అతనికి పాజిటివ్ అని తేలడంతో విజయవాడ కొవిడ్ ఆస్పత్రిలో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుకు తరలించారు.
ఈఎస్ఐ కేసులో అరెస్టైన మాజీ పీఎస్‌కు కరోనా పాజిటివ్ - పితాని సత్యనారాయణ
ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయిన పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్‌కు కరోనా సోకింది. చికిత్స కోసం విజయవాడలోని కొవిడ్ ఆస్పత్రికి తరలించారు.
PS arrested in ESI case